బ్యాంకుల్లో వారానికి ఐదు రోజులే పని దినాలు అమలు చేయాలంటూ యూనియన్ సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. అధిక ఒత్తిడి కారణంగా ఉద్యోగుల ఆరోగ్యం దెబ్బ తింటుందని ఎంప్లాయిస్ వాపోతున్నారు. ఇప్పటికే రెండో శనివారం, నాల్గో శనివారం బ్యాంకులకు సెలవులు అమలవుతున్నాయి. మిగతా రోజుల్లోనూ శని, ఆదివారాలు సెలవులు అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది నుంచే అమలు చేయాలని పట్టుబడుతున్నారు. తాజాగా ఇదే అంశంపై ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని లభించే అవకాశం లేదని తేల్చిచెప్పింది.
ఇది కూడా చదవండి: YSRCP: ముగిసిన వైసీపీ విస్తృత సమావేశం.. పోరుబాట కార్యాచరణ ప్రకటన..
డిసెంబర్ 2024లో బ్యాంక్ ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని ఉండే అవకాశం లేదని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ తెలిపింది. వారంలో ఐదు రోజుల పనిదినాల అమలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచన లేదని… త్వరలో ఆందోళన చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఏఐబీఓసీ ప్రధాన కార్యదర్శి రూపమ్ రాయ్ తెలిపారు. ఉద్యమంలో చేరాలని అనుబంధ సంఘాలకు ఆహ్వానాలు పంపుతున్నట్లు పేర్కొంది. 5 రోజుల పని దినాల కోసం త్వరలో ఆందోళనలు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Jani Master : జానీ మాస్టర్ కు కొరియోగ్రఫీ అవకాశం వచ్చిందా..?