రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని సోమవారం కోల్‌కతాలో అన్నారు.
ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ టూర్‌లో టెస్టు సిరీస్ ఆడుతుంది. మరో నెల రోజుల పాటు అక్కడే ఉండి వన్డే, టీ20 సిరీస్‌లను ఆడనుంది. ఆ తర్వాత ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ టోర్నీలు ఆడుతుంది. ఆ తర్వాత డిసెంబర్‌లో సౌతాఫ్రికా టూర్‌కి బయలుదేరి వెళ్లనుంది. డిసెంబర్ 10 నుంచి సౌతాఫ్రికాలో మూడు మ్యాచ్ ల టీ20, వన్డే సిరీస్‌లతో పాటు రెండు టెస్ట్ మ్యాచ్ లు కూడా ఆడుతుంది.
సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. మాదాపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగించనున్న మెట్రోరైలు నిర్మాణ పనుల శంకుస్థాపనలో భాగంగా.. రేపు (ఈనెల9)న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని మాదాపూర్, నార్సింగి ఠాణాల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు వెల్లడించారు.
మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే వెంటనే పూర్తి చేయండి. నవంబర్ నెల ముగియడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. డిసెంబర్ 2022లో బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ వచ్చే నెలలో అంటే డిసెంబర్‌లో 13 రోజుల సెలవులు ఉండబోతున్నాయి.
దేశంలో 5జీ సేవలు సజావుగా అందేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు, టెలికాం నెట్‌వర్క్ సంస్థలతో టెలికాం-ఐటీ ఉన్నతాధికారులు బుధవారం సమావేశం నిర్వహించనున్నారు.
Andhra Pradesh: ఏకలవ్య మోడల్ స్కూల్స్ 3వ జాతీయ క్రీడా పోటీలకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబర్ 17 నుంచి 23 వరకు ఏకలవ్య జాతీయ క్రీడలు జరగనున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం, లయోలా కాలేజీ, గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, బీఆర్ స్టేడియంలో పోటీలు జరుగుతాయి. 15 వ్యక్తిగత విభాగాలు, 7 టీమ్ కేటగిరీల్లో ఈ పోటీలను నిర్వహించనున్నారు. అండర్-14, అండర్-19 కేటగిరీల్లో జరిగే ఏకలవ్య జాతీయ క్రీడల్లో దేశవ్యాప్తంగా 5,970 మంది క్రీడాకారులు పాల్గొంటారు.…
జిల్లాలో ఎక్కడ చూసినా కల్యాణ మండపాలు పెళ్లి సందడితో కళకళలాడుతున్నాయి. సుముహూర్తాలకు ఇక కొద్ది రోజులే గడువు ఉండటంతో శుభకార్యానికి ఆలస్యమెందుకు అంటూ తల్లిదండ్రులు తమ పిల్లలకు వివాహాలు జరిపించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో.. బంగారు, వస్త్ర దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఇక శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు…అంటున్నారు పురోహితులు. అవును మరి…వచ్చేనెల (జూన్) దాటితే తిరిగి డిసెంబరు వరకు వేచి చూడాల్సిందే. లేదా వచ్చే సంవత్సరమే. ఈ ముహూర్తాలు దాటితే ఐదు నెలలపాటు ముహూర్తాలు ఉండవట. అందుకే తల్లిదండ్రులు హడావుడి…
దేశంలో జీఎస్టీ వసూళ్లు వరుసగా ఆరో నెల కూడా లక్ష కోట్లు దాటాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో రూ.1,29,780 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా (సీజీఎస్టీ) రూ.22,578 కోట్లు కాగా… రాష్ట్రాల వాటా (ఎస్‌జీఎస్టీ) రూ.28,658 కోట్లు, అంతర్జాతీయ వాటా (ఐజీఎస్టీ) రూ.69,155 కోట్లుగా నమోదయ్యాయి. ఐజీఎస్టీలో దిగుమతిపై వచ్చిన రూ.37,527 కోట్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సెస్ రూపంలో రూ.9,389 కోట్లు వసూలయ్యాయి. Read…
మేషం :- కొబ్బరి, పండు, పూలు, పానీయ, చిరు వ్యాపారులకు లాభదాయకం. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోక తప్పదు. అవివాహితులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. బంధు మిత్రులకు శుభాకాంక్షలు అందజేస్తారు. సోదరులతో ఏకీభవించలేకపోతారు. మీ కుమారుని మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. వృషభం :- మీ ఉన్నతిని చాటుకోడటం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు పనివారి నుంచి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. బంధువుల నుంచి ఆహ్వానాలను అందుకుంటారు.…
కరోనా మహమ్మారి నేపథ్యంలో స్థంభించిన అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు ఈ ఏడాది చివరి నాటికి సాధారణ స్థితికి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని బుధవారం విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సాల్ వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో అంతర్జాతీయ విమానప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెల్సిందే.. అయితే ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో వివిధ దేశాలు నిబంధనలు, ఆంక్షలను సడలిస్తున్నాయి. ఇప్పటికే అన్ని రూట్లలో 33 శాతం…