Telangana : తెలంగాణాలో విషాదం.. గాలి పటాలు ఎగురవేస్తూ ఐదుగురు యువకులు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏడాదికి ఒక్కసారి వచ్చే సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఎంత గ్రాండ్ గా జరుపుకుంటారో తెలుసు.. ఈ పండగను పేద, ధనిక అని తేడా లేకుండా వారికి ఉన్నంతలో ఘనంగా జరుపుకుంటారు.. ఈ సంక్రాంతి కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. గత రెండు రోజులుగా గాలిపటాలు ఎగరేసిన ఘటనల్లో తెలంగాణ వ్యాప్తంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు యువకులు విద్యుదాఘాతంతో, పైకప్పుపై నుండి పడి ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు మంజా తగిలి మరణించాడు..
వీటిలో నలుగురు హైదరాబాద్ వాసులు మృతి చెందగా, ఒకరు సంగారెడ్డి లో చనిపోయారు.. హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్‌లోని తన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ టెర్రస్ నుండి పడి 20 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మృతుడు అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ రాజశేఖర్ కుమారుడు ఆకాష్‌గా గుర్తించారు.. గాలిపటాలు ఎగురవేస్తూ ప్రమాదవాసాత్తు కిందపడి మరణించారు..
Also Read
ఇక జోగిపేట పట్టణంలోని రెండంతస్తుల ఇంటి టెర్రస్‌పై గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుదాఘాతంతో 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి సుబ్రహ్మణ్యం గా పోలీసులు గుర్తించారు. గాలిపటం ఎగురవేస్తుండగా హైటెన్షన్ వైరు తగిలి భవనంపై నుంచి పడిపోయాడు.. ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలను విడిచాడు.. అలాగే అత్తాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ భవనం టెర్రస్‌పై గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుదాఘాతంతో తనిష్క్ (11) మృతి చెందాడు. ఆ బాలుడు తన స్నేహితులతో కలిసి ఓ అపార్ట్‌మెంట్ భవనం పైకప్పుపై గాలిపటాలు ఎగురవేస్తున్నాడు.. విద్యుత్ వైర్ తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.. అలాగే నాగోల్ లో ఓ చిన్నారి గాలి పటాలు ఎగురవేస్తూ చనిపోయాడు..
లోహపు పూతతో కూడిన ‘మాంజా’ దారం విద్యుత్ ప్రసరించే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు తెలాపారు. విద్యుత్ స్తంభాల దగ్గర గాలిపటాలు ఎగురవేయవద్దని విద్యుత్ అధికారులు ప్రజలకు సూచించారు.. చైనా మాంజా హైదరాబాద్‌లో ఓ సైనికుడి ప్రాణాలను బలిగొంది.. అతని గొంతుకు వైర్ తగిలి కోసుకుపోయింది.. ఆసుపత్రి లో చికిత్స పొందుతూ చనిపోయాడు..
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!