Road Accident: కేరళలోని మలప్పురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి శబరిమల యాత్రికులు వెళ్తున్న ఆటో, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సహా ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఆటో డ్రైవర్‌తో పాటు ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వీరంతా ఆటోలో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలోనే కొంతమంది గాయపడ్డారు, వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్నారు.
Read Also:SBI Notification 2023: ఎస్‌బీఐలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు.. ఒక్కరోజే గడువు..
#WATCH | Malappuram, Kerala: Auto driver and 4 passengers of an auto died after the auto collided with a bus of Sabarimala pilgrims coming from Karnataka (15/12)
(Visuals of injured being taken to hospital) pic.twitter.com/rK3K6sYWAo
— ANI (@ANI) December 15, 2023
ఈ ప్రమాదం జరగడంతో ఘటనా స్థలంలో విషాదఛాయలు అలముకున్నాయి. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం బస్సు, ఆటో డ్రైవర్ వల్ల జరిగిందా లేక మరేదైనా కారణాల వల్ల జరిగిందా అనేది ఇంకా తెలియరాలేదు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై మలప్పురం జిల్లా పోలీసు చీఫ్ శశిధరన్ ఎస్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదంపై మోటారు వాహన శాఖ సహకారంతో పోలీసులు విచారణ జరుపుతారని తెలిపారు.
Read Also:Gold Price Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
ఆటోడ్రైవర్ తానిపర పుతుపరంబం అబ్దుల్ మజీద్ (50), కారువారకుండ్ వలయూర్‌కు చెందిన భార్య తస్నీమా (33), పిల్లలు రిన్షా ఫాతిమా (12), రైహా ఫాతిమా (4), తస్నీమా సోదరి, కుట్టిపర హమీద్ భార్య ముహ్సీనా (35) మృతి చెందారు. గాయపడ్డ ఐదుగురిలో తస్నీమా కుమారుడు మహమ్మద్ రేయాన్ (ఏడాది) పరిస్థితి విషమంగా ఉంది. తస్నీమా తల్లి సబీరా (58), ముహ్సినా పిల్లలు ఫాతిమా హసా, మహమ్మద్ హసన్, ముహమ్మద్ మిషాద్ ఉన్నారు. వారు మంచిరి, కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బస్సులో 22 మంది ప్రయాణికులు ఉండగా ఎవరికీ గాయాలు కాలేదు. బస్సు ముందు భాగం దెబ్బతింది.