Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్సాహం రోజురోజుకూ పెరుగుతోంది. ఆగస్టు 9న మహేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ‘వారణాసి’ నుంచి ఏదో ఒక ప్రత్యేక అప్డేట్ వస్తుందని అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ‘వారణాసి’పై అంచనాలు దేశవ్యాప్తంగా భారీగానే ఉన్నాయి. అలాంటి సమయంలో ఈ సినిమా గురించి వస్తున్న అప్డేట్స్ మాత్రం అభిమానులను నిరాశలో ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కనీసం ఒక గ్లింప్స్, టీజర్ లేదా ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేస్తారని అభిమానులు ఆశించారు. గతంలో కూడా స్టార్ హీరోల పుట్టినరోజులకు మేకర్స్ ప్రత్యేక టీజర్లు విడుదల చేయడం ఆనవాయితీగా మారడంతో ఈసారి కూడా అలాంటి సర్ప్రైజ్ ఉంటుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అయితే తాజా సమాచారం ప్రకారం అభిమానుల అంచనాలకు ఈసారి బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. చిత్రబృందం ‘వారణాసి’ నుంచి ఎలాంటి గ్లింబ్స్, టీజర్ ను గాని రిలీజ్ చేసే ఆలోచనలో లేనట్లు టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్‌ను మాత్రమే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు మరో సారి నిరాశలో పడుతున్నట్లే కనిపిస్తోంది. అయితే ఈ నిర్ణయం వెనుక రాజమౌళి పనితీరు కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆయన తన సినిమాలకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌ను ఎంతో వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తారని తెలిసిందే. అందుకే సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండటంతో ప్రస్తుతం పెద్ద రివీల్స్ చేయకుండా, మంచి అవుట్ పుట్ వచ్చాక రిలీజ్ చేసేందుకు జక్కన్న వ్యూహం రచిస్తున్నట్లు కూడా సినీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
ఇదిలా ఉంటే, ‘వారణాసి’ చిత్రాన్ని నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేయడానికి రాజమౌళి బృందం వేగంగా పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్రీకరణను పూర్తి చేసే పనిలో యూనిట్ నిమగ్నమై ఉంది. భారీ అడ్వెంచర్, ప్రపంచ యాత్ర నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే మహేష్ అభిమానులకు ఈసారి గ్లింప్స్ దక్కకపోయినా, రాజమౌళి సినిమాల విషయంలో ప్రతి అప్డేట్ కూడా పెద్ద ఈవెంట్‌లా మారుతుందనే విషయం తెలిసిందే. అందుకే మేకర్స్ సరైన సమయంలో విడుదల చేసే మొదటి విజువల్ కోసం అభిమానులు ఇంకొంతకాలం ఓపిక పట్టాల్సిందేనని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.
తాజావార్తలు
-
Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
-
CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
-
India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
-
Former OSD Sumanth : మాజీ OSD సుమంత్‌కు బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్.!
-
TG SAFE : కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 5 లైసెన్సులు సస్పెండ్..!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!