మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు. డీఎస్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.
Alcohol : మద్యం వల్ల ఏటా 26 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది మద్యం, మాదక ద్రవ్యాల వల్ల వచ్చే వ్యాధులతో బాధపడుతున్నారు.
ప్రముఖ కన్నడ సాహితీవేత్త ‘నాడోజ’ కమల హంపన (88) తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా ఆమె కన్నుమూశారు. శనివారం బెంగళూరులోని రాజాజీ నగర్ నివాసంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
భార్య చనిపోవడంతో ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని అస్సాం డీజీపీ జీపీ సింగ్ స్వయంగా ఎక్స్‌లో పోస్ట్ చేయడం ద్వారా ధృవీకరించారు. ఆయన తన పోస్ట్‌లో.. 'ఇది దురదృష్టకర సంఘటన. అస్సాం హోం, పొలిటికల్ సెక్రటరీ షిలాదిత్య చెటియా ఈరోజు సాయంత్రం ప్రాణాలు తీసుకున్నారు. అతను 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. చాలా కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న తన భార్య మరణించిన నిమిషాల తర్వాత అతను ఈ చర్య తీసుకున్నాడు.…
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఓ క్రైస్తవుడిని కొట్టి చంపారు. దైవదూషణ ఆరోపణలపై గత వారం హింసాత్మక గుంపు క్రైస్తవ వృద్ధుడిపై దాడి చేసింది. ఈ క్రమంలో ఆయన మరణించినట్లు సోమవారం పోలీసులు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళ్తే.. రాడికల్ ఇస్లామిస్ట్ తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్తాన్ (TLP) కార్యకర్తలు సర్గోధా జిల్లాలోని ముజాహిద్ కాలనీలో ఉండే.. క్రైస్తవ సంఘ సభ్యులపై దాడి చేశారు. ఇద్దరు క్రైస్తవులను, 10 మంది పోలీసులపై దాడి చేశారు. కాగా.. ఈ దాడిలో వారికి తీవ్ర…
అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వరదల్లో మరణించిన వారి సంఖ్య 15కి పెరిగిందని.. ప్రభావిత జనాభా సంఖ్య ఆరు లక్షలకు పైగా పెరిగిందని అధికారిక బులెటిన్ శనివారం తెలిపింది. శుక్రవారం నాటికి 11 జిల్లాల్లో బాధితుల సంఖ్య 3.5 లక్షలు అని పేర్కొంది. అయితే.. ప్రభావిత జిల్లాల సంఖ్య 10కి తగ్గిందని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ విడుదల చేసింది. మే 28 నుండి 15 వరకు…
పాట్నా కాలేజీలో దారుణం జరిగింది. బీఎన్ కాలేజీలో ఒకేషనల్ కోర్సులో ఇంగ్లీస్ చదువుతున్న థర్డ్ ఇయర్ విద్యార్థి హర్ష్ రాజ్(22)ను ముసుగులు ధరించిన 10-15 మంది దుండగులు కర్రలతో కొట్టి హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తమిళనాడులో దారుణం జరిగింది. ఒక వ్యక్తిని నడిరోడ్డుపై ఆరుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చారు. చుట్టుప్రక్కల జనాలు ఉన్నా ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఉత్తమ్ నగర్ ప్రాంతంలోని శివ్ విహార్‌లో డ్రగ్స్ దందా చేస్తున్న ముఠా శనివారం రాత్రి ఓ యువకుడిని కిరాతకంగా కొట్టి చంపారు. అంతకు ముందు యువకుడిని చిత్రహింసలు పెట్టారు. అతని ప్రైవేట్ భాగాలను బైక్‌తో తొక్కించి.. కారం చల్లారు. ఆ యువకుడు నొప్పితో కేకలు వేస్తుండటంతో చేతులు, కాళ్లు కట్టి నోటిలో మూత్ర విసర్జన చేశారు నిందితులు. ఈ క్రూర ఘటన ఓ వీధిలో జరిగింది. అయితే.. ఆ…
కేరళలోని కోజికోడ్‌లో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ రోగిని.. అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మంటల్లో కాలిపోయింది. ప్రమాదవశాత్తు అంబులెన్స్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో.. అంబులెన్స్‌లో ఉన్న మహిళా రోగి సజీవ దహనమైంది.