ఇక మాటలుండవ్.. మాట్లాడుకోవడాలుండవ్.. తేడా జరిగితే అంతే సంగతులు. పదవి ఉంది కదా.. పార్టీ పవర్‌లో ఉంది కదా.. ఎంజాయ్ చేసేద్దాం.. అనుభవించు రాజా అంటూ ఆడుతూ పాడుతూ గడిపేద్దామంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు చెప్పేసిందట అధినాయకత్వం.
తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కొత్త అధ్యక్షులను ప్రకటించింది ఆల్‌ఇండియా కాంగ్రెస్ కమిటీ. మొత్తం 36 మంది పేర్లను ఖరారు చేస్తూ 33 జిల్లాలతో పాటు కొన్ని కార్పొరేషన్లకు కూడా కొత్త బాధ్యులను నియమించింది. పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఆయా డీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఖలీఫ్ సైదుల్లా, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడిగా దీపక్ జాన్ ను ఏఐసీసీ ప్రకటించింది. రంగారెడ్డి, సంగారెడ్డి మినహా అన్ని జిల్లాలకు డీసీసీలను ప్రకటించింది…
తెలంగాణ కాంగ్రెస్‌లో డీసీసీ అధ్యక్షుల వాయిస్ పెరిగిందా..? పీసీసీ లక్ష్యంగా ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు? ఆ వ్యాఖ్యల వెనక ఏదైనా వ్యూహం ఉందా? లేక పార్టీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహారం నడిపించారా? రేవంత్ అందుబాటులో ఉండటం లేదని డీసీసీల ఫిర్యాదుతెలంగాణ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. పార్టీ సభ్యత్వాలు చేయించాలని చెబుతుంటే..! సరే.. మా సంగతేంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నల వెనక వ్యూహం ఏంటి? జిల్లాలలో ఉన్న అసంతృప్తిని పీసీసీ దృష్టికి…