తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కొత్త అధ్యక్షులను ప్రకటించింది ఆల్‌ఇండియా కాంగ్రెస్ కమిటీ. మొత్తం 36 మంది పేర్లను ఖరారు చేస్తూ 33 జిల్లాలతో పాటు కొన్ని కార్పొరేషన్లకు కూడా కొత్త బాధ్యులను నియమించింది. పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఆయా డీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఖలీఫ్ సైదుల్లా, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడిగా దీపక్ జాన్ ను ఏఐసీసీ ప్రకటించింది. రంగారెడ్డి, సంగారెడ్డి మినహా అన్ని జిల్లాలకు డీసీసీలను ప్రకటించింది అధిష్టానం.
జిల్లావారీగా కొత్త డీసీసీ అధ్యక్షులు