భారతీయులు వండుకునే వంటకాల్లో ముఖ్యమైన వాటిలో టొమాటో ఒకటి. ఈ కూరగాయ లేకుండా ఏ కూర గానీ పప్పు గానీ రుచి అసంపూర్ణంగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న కొరత కారణంగా.. టమోటాలు చాలా ఖరీదై అయిపోయాయి. గత కొన్ని వారాల్లో టమాటా ధరలు భారీగా పెరగగా.. కొందరు టొమాటోలను కొనేయడమే మానేశారు. సహజంగానే టొమాటో మన ఆహారపు రుచిని పెంచుతుంది. కానీ టొమాటోతో కొంతమందికి హాని కలిగిస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను ఎదుర్కొంటున్న వ్యక్తులకు టమోటాలు హాని కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాంటి వారికి టొమాటో తినడం వలన కడుపు మంట వస్తుంది. అంతే కాకుండా.. టొమాటోలు తిన్న తర్వాత గుండెల్లో మంట, అజీర్ణం లేదా జీర్ణశయాంతర సమస్యలు ఉన్నవారు టమోటాలు తినకుండా ఉండటం మంచిది. అయితే టొమాటో ఎవరెవరు తినకూడదో తెలుసుకుందాం.
Ranil Wickremesinghe: యూఎస్ డాలర్‌తో సమానంగా భారత్ రూపాయి: శ్రీలంక అధ్యక్షుడు
కిడ్నీ స్టోర్ ఉన్నవారు దూరంగా ఉండాలి
కిడ్నీలో రాళ్ల కారణంగా కొందరు టమోటాలు తినకుండా దూరంగా ఉంటారు. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆక్సలేట్ స్టోన్స్ ఉన్నవారు మాత్రమే టమోటాలు తినకూడదు. టొమాటోస్‌లో ఆక్సలేట్ అనే పదార్ధం ఉంటుంది. ఇది ఆక్సలేట్ ఉన్న వ్యక్తులలో రాళ్లను పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో.. డాక్టర్ ను సంప్రదించిన తర్వాత మాత్రమే టమోటాలను తినాలి.
అలర్జీలు
కొంతమంది టమోటాలు తినడం వల్ల అలెర్జీ వస్తుంది. అలాంటి సందర్భాలు చాలా అరుదైనప్పటికీ.. కొందరికి దురద మరియు వాపు వంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ టొమాటోలు తింటే అలెర్జీ వచ్చినట్లయితే దీనిని తినడం మానుకోండి.
రక్తం గడ్డ కట్టుట
టమోటాలు రక్తం గడ్డకట్టే మందులకు హాని కలిగించే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. రక్తం పలుచగా ఉండే వారు టమోటాలకు దూరంగా ఉండాలి. టొమాటోల్లో విటమిన్ K ఉంటుంది. ఇది ఈ ఔషధాల ప్రభావాలను తగ్గిస్తుంది.