కరోనా వైరస్ వ్యాక్సిన్ యొక్క దుష్ప్రభావాలకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న వేళా.. ఇప్పుడు మరో కొత్త టెన్షన్ నెలకొంది. వ్యాక్సిన్ వల్ల కలిగే దుష్పరిణామాలకు భయపడేలా చేసి అమాయకుల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు ఎవరికీ ఆర్థిక నష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. గుర్తు తెలియని నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
Read Also: Jammu and Kashmir: ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం
కాగా, టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. వ్యాక్సిన్ గురించి గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్స్ చేస్తున్నారని.. అలాగే, ఆధార్ నంబర్, బ్యాంక్ వివరాల వంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయం ఇటీవల కోల్‌కతాలో వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. కొంతమందికి IVRS కాల్స్ చేసి వారితో ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ సహాయంతో మోసాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Also: Turtles Seized: అక్రమంగా తరలిస్తున్న 1600 తాబేళ్ల పట్టివేత!
ఇక, కోల్‌కతా పోలీసుల సైబర్ సెల్ అధికారి మాట్లాడుతూ.. ఒక వ్యక్తి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అని రికార్డ్ చేసిన వాయిస్ మొదట అడుగుతుంది.. ఆ తర్వాత 1 కోవిషీల్డ్ అయితే 1 నొక్కండి.. కోవాక్సిన్ అయితే 2 నొక్కండి అని అడుగుతాడు.. అలా చేయడంతో మీ ఫోన్ ను స్తంభింపజేస్తుంది.. దీంతో కొన్ని గంటల పాటు నెట్‌వర్క్ ఆగిపోతుంది అని నివేదించారు. దీని ద్వారా మీ యొక్క ఫోన్‌పై నియంత్రణ సాధించడంతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు పొందే అవకాశం ఉందని సైబర్ నిపుణులు భావిస్తున్నారు.