హైదరాబాద్ లో ‘రైతే రాజైతే’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీపీఐ నారాయణ పాల్గొన్నారు. ఈ పుస్తకాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ రామచంద్రరావు, ఎన్ రఘువీరా రెడ్డిలు సంయుక్తంగా రాశారు అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ పవిత్రమైంది అని పేర్కొన్నారు. అన్ని పార్టీల సిద్ధాంతాలు బాగానే ఉంటాయి.. కానీ ఆచరణలోనే అది ఉండదు.. కాంగ్రెస్ పార్టీ.. మా పార్టీ సిద్ధాంతాలు కాస్త దగ్గర ఉంటాయి.. ప్రతిపక్షాలను వైఎస్ఆర్ గౌరవిస్తారు అని ఆయన తెలిపారు. నచ్చితే చేస్తాం లేకపోతే లేదని చెప్తాడు.. రాజశేఖర్ రెడ్డి వాళ్ళ నాన్న రాజారెడ్డికి కమ్యూనిస్ట్ పార్టీలతో మంచి సంబంధాలు ఉండేవి అని నారాయణ తెలిపారు.
Read Also: Viral Video: వాట్ ఏ టాలెంట్.. ఒక్క కాలుతో డ్యాన్స్ ఇరగదీసింది..
రాజశేఖర్ రెడ్డికి కూడా కమ్యూనిస్టులతో మంచి సంబంధాలు ఉండేవి అని సీపీఐ నారాయణ అన్నారు. పోలవరం కోసం ఆయన నిలబడితే మేము మద్దతు ఇచ్చాం.. ఇష్యూస్ మీద పోరాడే సమయంలో ఆయనకు సపోర్టుగా నిలిచామన్నారు. కాంట్రవర్సీలు చాలా ఉన్నాయి.. పని చేసే వాడికే విమర్శలు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా.. రాజశేఖర్ రెడ్డిపై ఆర్థిక పరమైన దాడులు జరిగాయి.. అప్పుడు వైఎస్సార్ వేరే పార్టీ పెడతాడేమో అనుకున్నాం.. కానీ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పని చేశాడు.. దేశంలో ప్రమాదకర ఘడియలు దగ్గర పడుతున్నాయి.. రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్- వన్ ఎలక్షన్ కోసం ఓ కమిటీని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Kamal Haasan: మా కుటుంబ సభ్యుడును కోల్పోయా.. కమల్ ఎమోషనల్