Nipah Virus: దేశంలో నిపా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నిపా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ అన్నారు. ఈ వైరస్ సోకిన వ్యక్తులందరూ మొదట వ్యాధి సోకిన రోగితో పరిచయం కలిగి ఉన్నవారేనని తెలిపారు. నిపా సోకిన వారి మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని రాజీవ్ బహల్ పేర్కొన్నారు. నిపా మరణాల రేటు 40 నుండి 70 శాతం మధ్య ఉండగా.. కోవిడ్ మరణాల రేటు 2-3 శాతం ఉంది. తాజాగా.. కేరళలోని కోజికోడ్ జిల్లాలో శుక్రవారం నిపా వైరస్ సోకిన మరో కేసు నిర్ధారించారు.
Mahadev Gambling App: UAEలో పెళ్లి కోసం రూ. 200 కోట్ల ఖర్చు.. బట్టబయలు చేసిన ఈడీ
ఓ 39ఏళ్ల వ్యక్తికి నిపా వైరస్ సోకినట్లు నిర్ధారించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కార్యాలయం శుక్రవారం తెలిపింది. అతను ఆసుపత్రిలో పరిశీలనలో ఉన్నాడు. ఆ వ్యక్తి ఆగస్టు 30న నిపాతో మరణించిన రోగితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాడని పేర్కొన్నారు. ఈ కొత్త కేసుతో కోజికోడ్‌లో మొత్తం నిపా సంక్రమణ కేసుల సంఖ్య ఆరుకు పెరిగింది.
Libya Flood: లిబియాలో వరద బీభత్సం.. చెల్లాచెదురుగా మృతదేహాలు
మరోవైపు చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య పెరగడంతో.. వ్యాధి సోకిన వ్యక్తితో పరిచయం ఉన్న, వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్న వారందరినీ పరీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేరళలో నిపా వైరస్ ఇన్‌ఫెక్షన్ నిర్ధారణ కావడం ఇది నాలుగోసారి. సాధారణంగా.. ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. తాజాగా రాష్ట్రంలో కనిపిస్తున్న నిపా స్ట్రెయిన్.. బంగ్లాదేశ్ వేరియంట్తో పోలి ఉందని అధికారులు చెబుతున్నారు.