Dengue In Delhi : కొద్ది రోజుల వరకు డిల్లీని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తగా.. ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు ఢిల్లీ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వరదల, నీటి నిల్వ కారణంగా దోమలు ఎక్కువగా వృద్ది చెంది దోమల మూలంగా వచ్చే వ్యాధులు, సీజన్ వ్యాదులు వ్యాప్తి చెందుతున్నాయి. వారం రోజుల్లోనే 105 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వరదనీరు తగ్గుముఖం పట్టడంతోపాటు వివిధ ప్రాంతాల్లో నీటి మడుగులు నిలిచిపోవడంతో రోగాలను వ్యాపింపజేసే దోమలు వృద్ధి చెందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డెంగ్యూ, చికున్‌గున్యా, జికా వైరస్‌లను వ్యాప్తి చేసే ఏడిస్ దోమల వ్యాప్తికి ఈ పరిస్థితులు అనువైనవని ఆరోగ్య నిపుణులు నొక్కి చెప్పారు. గత వారంలో మలేరియా మరియు చికున్‌గున్యా కేసులు కూడా స్వల్పంగా పెరిగాయి. గత వారం రోజుల్లో 13 మలేరియా కేసులు , 85 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 15 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి.
Read also: Andhrapradesh: వరదల్లో ఎస్సై సాహాసోపేత రెస్క్యూ ఆపరేషన్.. అభినందించిన ముఖ్యమంత్రి
జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు వారం రోజుల్లో 105 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన మొత్తం డెంగ్యూ కేసుల సంఖ్య 348కి చేరింది. 2018 నుంచి ఇప్పటివరకు గడిచిన ఐదేండ్లలో ఆగస్టు 6 నాటికే డెంగ్యూ కేసుల సంఖ్య 175 దాటడం ఇదే తొలిసారి. ఆగస్టు 6 నాటికి 2018లో 64 కేసులు, 2019లో 47 కేసులు, 2021లో 55 కేసులు నమోదు కాగా 2020లో కేవలం 35 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2022లో అధికంగా అంటే 174 కేసులు కాగా.. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా 348 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. గడిచిన ఐదేండ్లలో ఆగస్టు నెల మొత్తం కలిపి కూడా ఎన్నడూ 100 డెంగ్యూ కేసులు నమోద కాలేదు. కానీ ఈసారి ఆగస్టు తొలి వారంలోనే డెంగీ కేసుల సంఖ్య 100 మార్కును దాటింది. ఈ ఏడాది ఆగస్టు తొలి వారానికే డెంగ్యూ కేసుల సంఖ్య 348 కి చేరడం ఆందోళన కలిగిస్తోందని ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు చెబుతున్నారు. దోమల వల్ల వచ్చే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి, నిలిచిపోయిన నీటిని తొలగించడం మరియు దోమల నివారణ మందులను ఉపయోగించడం వంటి తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య అధికారులను పౌరులు కోరారు. దోమల సంఖ్యను అరికట్టడానికి మరియు వ్యాధులు మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి వారు వెక్టర్ నియంత్రణ చర్యలను మున్సిపల్ అధికారులు ముమ్మరం చేస్తున్నారు. ఈ వ్యాధుల బారిన పడిన వారికి వేగంగా మరియు సమర్థవంతమైన చికిత్స అందించడానికి స్థానిక ఆసుపత్రులు మరియు వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్టు అధికారులు ప్రకటించారు. పరిస్థితిని పరిష్కరించడానికి ప్రభుత్వం వివిధ ఏజెన్సీలతో సమన్వయం చేస్తోంది, ప్రభావిత ప్రాంతాలకు అదనపు వనరులను మోహరించడం మరియు నివారణ చర్యల గురించి నివాసితులకు అవగాహన కల్పించడానికి ప్రజలకు అవగాహన ప్రచారాలను ప్రారంభించింది.