Daggubati Purandeswari: కుట్రలు జరుగుతున్నాయి.. భారతీయులంతా ఒకటే అనే భావనతో ఉండాలి..
- కొన్ని దేశాల కుట్రల నేపథ్యంలో భారతీయులంతా ఒకటే అనే భావనతో ఉండాలి..
- మనకంటే ముందు తరం వాళ్లు ఎన్నో త్యాగాలు చేశారు.. స్వాతంత్య్రం తెచ్చారు..
- ఐకమత్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పై ఉందన్న పురంధేశ్వరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Purandeswari: కొన్ని దేశాల కుట్రల నేపథ్యంలో భారతీయులంతా ఒకటే అనే భావనతో ఉండాలని పిలుపునిచ్చారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి.. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె.. జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు.. ఈ కార్యక్రమంలో వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.. ఇక, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఏపీ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.. మనకంటే ముందు తరం వాళ్లు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర్యం తెచ్చారు.. ఐకమత్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉంది అన్నారు.. ఆనాడు 40 కోట్ల మంది దేశ ప్రజలు ఈ స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామ్యం అయ్యారు.. ఇప్పుడు మన దేశ జనాభా 144 కోట్లు ఉన్నారు.. మన దేశ ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని గుర్తుచేశారు.
Read Also: Mahindra Thar Roxx SUV: మహీంద్రా థార్ రాక్స్ వచ్చేసింది.. ధర రూ.12.99 లక్షలు, మైమరిపించే ఫీచర్లు!
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
ఇక, ప్రపంచ దేశాలు మొత్తం ఇప్పుడు మన దేశం వైపు చూస్తున్నాయన్నారు పురంధేశ్వరి.. కొన్ని దేశాల కుట్రల నేపథ్యంలో భారతీయులంతా ఒకటే అనే భావనతో ఉండాలన్న ఆమె.. 2040 నాటికి వికసిత భారత్ చూడాలనేది లక్ష్యం.. వికసిత భారత్ కోసం మనం అంతా కలిసి పనిచేయాలి.. రాష్ట్ర అభివృద్ధికి అంకితం అయి ముందుకు సాగాలి అన్నారు.. మొన్న ఎన్నికలలో ప్రజలు కూటమికి తిరుగు లేని అధికారం ఇచ్చారు.. ప్రజల సమస్యలు పరిష్కారం కోసం బీజేపీ వారధి కార్యక్రమం ప్రారంభించిందన్నారు.. నేటి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారు.. ప్రజలు సమస్యలు పరిష్కరించి వాటిని ఒక యాప్ లో కూడా పెడతాం అన్నారు.. ప్రజలకు సేవకులుగా పని చేసి.. వారి కన్నీరు తుడుస్తాం అన్నారు.. ఇక, ఈ సందర్భంగా వినతుల స్వీకరణకు ప్రత్యేక వెబ్ సైట్‌ను ప్రారంభించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి.
తాజావార్తలు
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
IAS Officer Vikas Marmath: పబ్లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!