ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నేడు రాజమండ్రిలో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన తర్వా తొలి సారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన నేడు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. రాజమహేంద్రవరం లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన సమావేశం జరగనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు మురుగన్, భూపతిరాజు శ్రీనివాసవర్మ,…
ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ హర్షణీయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర విభజనకు సంబంధించి ఆస్తులు, అప్పులు పంపకాలకు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులు నేరుగా భేటీ కావడం వలన అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ సాయంత్రం మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రంగం సిద్ధమైన నేపథ్యంలో 3.0 కార్యక్రమం లోక్‌సభ స్పీకర్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై బీజేపీ దృష్టి సారించింది. ఈ పదవి తమకే ఇవ్వాలని టీడీపీ బీజేపీని కోరిన సంగతి తెలిసిందే. టీడీపీకి సొంత స్పీకర్ కావాలని బీజేపీ చెప్పింది. కానీ మీడియా ద్వారా వారు ఇప్పుడు ఈసారి ఆ పదవిని మహిళలకే ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఏపీ, తెలంగాణలో బాగా పనిచేసినందున లోక్‌సభ స్పీకర్‌గా పురందేశ్వరి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.…
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. ఈ రోజు సాయంత్రం.. కాపు రామచంద్రారెడ్డి, సాధినేని యామిని శర్మ, బిట్ర శివన్నారాయణ, పాతూరి నాగభూషణం తదితర నేతలతో రాజ్‌భవన్ వెళ్లిన ఆమె.. గవర్నర్‌ను కలిసి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు ప్రకటించాలని కోరుతూ గవర్నర్‌కు లేఖ అందించారు..
2024 సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కొన్ని రాజకీయ పార్టీల ప్రభావంతో పలువురు జిల్లా కలెక్టర్లు, బ్యూరోక్రసీలోని కొందరు ఉన్నతాధికారులు వచ్చే రెండు నెలల పాటు దేవాదాయ శాఖ సిబ్బంది సేవలను వినియోగించుకోవద్దని ఏపీ చీఫ్ ఎన్నికల ప్రధాన అధికారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి లేఖ రాసింది.