Daggubati Purandeswari: నేడు రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రైల్వే డి.ఆర్.ఎం నరేందర్ ఏ పాటిల్ పర్యటించారు. 250 కోట్ల రూపాయలతో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేపట్టనున్న నేపథ్యంలో పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ… రాజమండ్రి రైల్వే స్టేషన్ ను వరల్డ్ క్లాస్ స్టేషన్ గా తీర్చిదిద్దుతాం అని., గోదావరి పుష్కరాలకు 2027 జనవరి నాటికే రాజమండ్రి రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేయమని అధికారాలను కోరినట్లు తెలిపారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ ను తూర్పు వైపున కూడా అభివృద్ధి చేయమని అడిగామని., సనుకుల వాతావరణంలో ఇవాళ రైల్వే అధికారులతో సమావేశం జరిగిందని., రాజమండ్రి రైల్వే స్టేషన్ సమస్యలపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇంకా కొవ్వూరు, అనపర్తి స్టేషన్లో మరికొన్ని రైళ్లు ఆపాలని కోరినట్లు ఆమె తెలిపింది.
Wayanad Landslides : ధైర్యానికి పేరు.. అన్నిటినీ దాటుకుని అమాయక గిరిజనులను కాపాడిన సైనికులు
అలాగే ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ… రాజమండ్రి తూర్పు రైల్వే స్టేషన్ రోడ్ ను విస్తరణ చేయాలని నిర్ణయించామని., రాజమండ్రి అన్నపూర్ణమ్మ పేట అండర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తున్నామని., హేవలాక్ వంతెన పర్యాటక రంగంగా అబివృద్ది చేస్తామని ఆయన అన్నారు. అలాగే అనపర్తి స్టేషన్ లో ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు విశాఖ వెళ్ళటానికి రైళ్ళు అందుబాటులో ఉండవు.. కాబట్టి అనపర్తిలో స్టేషన్లో జన్మభూమి హాల్ట్ , ఫుట్ ఓవర్ బ్రిడ్జి అడిగామని., బిక్కవోలు రైల్వే స్టేషన్ అబివృద్ది చేయాలని., కేశవరం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై డిఆర్ఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు.
Sandra Venkata Veeraiah: కాంగ్రెస్ పాలనపై హట్ కామెంట్స్ చేసిన మాజీ ఎమ్మెల్యే సండ్ర..
ఇక ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే సూచన మేరకు రైల్వే స్టేషన్ తూర్పు వైపు కూడా అభివృద్ధి చేస్తాం.. రాజమండ్రి రోడ్డు కమ్ రైలు వంతెన పై భారీ వాహనాలు నిషేధించమని జిల్లా అధికారులకు స్పష్టంగా చెప్పామని రైల్వే డి.ఆర్.ఎం నరేందర్ ఏ పాటిల్ తెలిపారు.