పహల్గాం దాడిలో ఉగ్రవాదులు ఏ మతం వారో అడిగి మరీ చంపడంతో సహనం పూర్తిగా పోయిందని, అందువల్లే పాకిస్తాన్‌కు భారత్ తిరిగి సమాధానం చెప్పాల్సి వచ్చిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. భారతదేశం 1947 నుండి సరిహద్దు ఉగ్రవాదంతో బాధపడిందన్నారు. భారతదేశాన్ని మరింతగా బాధపెట్టకుండా పాకిస్తాన్ వెనక్కి తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ పాక్ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంది అని పురంధేశ్వరి చెప్పారు. పారిస్‌లోని భారతీయ ప్రవాసులను ఉద్దేశించి భారతదేశ అఖిలపక్ష ప్రతినిధి బృందం సభ్యురాలు పురందేశ్వరి ప్రసంగించారు.
Also Read: Mahanadu 2025: కడపలో ప్రారంభమైన టీడీపీ మహానాడు.. రిజిస్ట్రేషన్ చేయించుకున్న సీఎం చంద్రబాబు!
దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ… ‘భారతదేశం 1947 నుండి 2025 ఏప్రిల్ 22 వరకు సరిహద్దు ఉగ్రవాదంతో చాలా కాలం బాధపడింది. దేవుడు అనుమతించడు, ఇది కొనసాగాలని మేము కోరుకోవడం లేదు. భారతదేశాన్ని మరింతగా బాధపెట్టకుండా పాకిస్తాన్ వెనక్కి తగ్గడం లేదు. 2014కి ముందు ఉగ్రవాదులు వచ్చి భారత పౌరులపై దాడి చేశారు. భారత్ బాధ్యతాయుతమైన దేశంగా ఉంది. భారత్ ఎప్పుడూ యుద్ధం చేయలేదు, ఇది పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదం. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు ఏ మతం వారో అడిగి మరీ చంపడంతో సహనం పూర్తిగా పోయింది. అందువల్లే భారత్ వారికి తిరిగి సమాధానం చెప్పాల్సి వచ్చింది. భారత్ అక్కడి పౌరులను లక్ష్యంగా చేసుకోలేదు. ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంది. పొరుగుదేశం పాకిస్తాన్ మాత్రం భారత్ పౌరులను, మిలిటరీని టార్గెట్ చేసి దాడులు చేసింది’ అని అన్నారు.