181.5 mm rainfall in AP: ఏపీలో ‘మిచాంగ్’ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో గత 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో ఏపీ తడిసి ముద్దయింది. తుఫాన్ దాటికి వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాలు జలమయం అవ్వగా.. రోడ్డుపైకి భారీగా వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో చేతికి వచ్చిన పంటలు నీటమునిగాయి.
ఏపీలో గత 24 గంటల్లో 181.5 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జంగారెడ్డిగూడెం మండలంలో 301.8 మిమీ వర్షపాతం నమోదవగా.. ముదినేపల్లిలో 92.2 మిమీ వర్షపాతం నమోదైంది. జీలుగుమిల్లి మండలంలో 285.00 మిమీ, కలిదిండి 164.8 మిమీ, కైకలూరు 164.4 మిమీ, పెదపాడు 114.4 మిమీ, ఏలూరు 122.6 మిమీ,కొయ్యలగూడెం 146.8 మిమీ, భీమడోలు 240.2 మిమీ, పెదవేగి 140.6 మిమీ, దెందులూరు 145.8 మిమీ, ఆగిరిపల్లి 1504 మిమీ, ఉంగుటూరు 244.2 మిమీ, నూజివీడు 116.8 మిమీ, నిడమర్రు 217.4 మిమీ, జీలుగుమిల్లి 285.0 మిమీ, ముసునూరు 110.2 మిమీ, చాట్రయి 140.2 మిమీ, లింగపాలెం 125.6 మిమీ, టి.నరసాపురం 240.2 మిమీ, కామవరపుకోట 250.8 మిమీ, బుట్టాయగూడెం 158.4 మిమీ, ద్వారకా తిరుమల 256.0 మిమీ, పోలవరం 197.0 మిమీ, చింతలపూడి 235.4 మిమీ, కుకునూరు 205.4 మిమీ, వేలేరుపాడు మండలంలో 218.00 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.