ప్రజలకు సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా మోసపోతూనే ఉన్నారు. సామాన్యుడి నుంచి పెద్ద ప్రొఫెషనల్స్ వరకు.. అందరూ ఇలాంటి మోసాల బారిన పడిన వారే.. ఎందుకంటే ప్రజలను బురిడీ కొట్టించేందుకు స్కామర్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఏదో పెద్ద కొరియర్ కంపెనీ నుంచి పార్సిల్ వచ్చిందని, దాంట్లో డ్రగ్స్ లాంటివి ఉన్నాయని భయపెడుతూ స్కామర్లు ప్రజల నుంచి డబ్బు గుంజుతున్నారు.
ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచాన్ని మన అరచేతిలోకి తీసుకొచ్చింది. అయితే ఇందులో వెబ్ బ్రౌజర్లు, సెర్చ్ ఇంజన్లు యాక్సెస్ చేయలేని ఒక పార్ట్ ఉంటుంది. అదే డార్క్ వెబ్ సైట్. ఇది చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు డార్క్ వెబ్ వేదికగా నిలుస్తుంది. ఇలాంటి హానికరమైన ప్లాట్పామ్లో యూజర్ల డేటా లీకైతే.. వారి సెక్యూరిటీ, ప్రైవసీకి పెద్ద ముప్పు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు..
Unknown Calls: సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలతో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నోరకాల మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈసారి సైబర్ నేరగాళ్ల వాట్సాప్ను తమ మోసానికి వారధిగా వినియోగించుకుంటున్నారు. ఇటీవల కాలంలో చాలామంది వాట్సాప్ యూజర్లకు తెలియని నెంబర్ నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ ఫేక్ కాల్స్ ద్వారా కొంతమంది అమాయకులను సైబర్ నేరగాళ్లు బుట్టలో వేసుకుంటున్నారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ నెంబర్ కొనుగోలుతో ఇతర దేశాల నుంచి ఫోన్ వస్తున్నట్లు భ్రమలు కలిగిస్తున్నారు.…
హైదరాబాద్ లో ఇన్స్టాగ్రామ్ లో పోస్టులకు రేటింగ్ ఇస్తామని చెప్పి మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగిని నుంచి సుమారు కోటి యాబై లక్షల రూపాయలను దుండగులు వసూలు స్వాహా చేశారు.
Cyber Scam: మల్టీ లెవెల్ మార్కెటింగ్లో చేరి చాలా మంది మోసపోతున్నా.. ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. వైన్ కంపెనీలో పెట్టుబడి పెట్టండి.. మీరు వైన్ బాటిల్ కొనుక్కోండి.. 60 రోజుల్లో మూడు రెట్లు ఇస్తాం.. మీరు చేరితే నెల జీతం ఇస్తామని కొందరు చేసిన ప్రకటనను గుడ్డిగా నమ్ముతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, సైబర్ నేరాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. దాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువత అటువైపు అడుగులు వేయకుండా జాగ్రత్తలను తీసుకుంటోంది. విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సరఫరా కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రెండు కొత్త వింగ్ లను రాష్ట్ర హోం శాఖ స్టార్ట్ చేసింది.
Cyber Crime: సైబర్ నేరాగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసపూరిత ప్రకటనలతో అమాయకుల నుంచి లక్షల రుపాయలు కాజేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందొచ్చొని కొందరికి టోకరా వేస్తున్నారు. పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను నిలువునా దోచేస్తున్నారు. ఓ యువతి నుంచి ఏకంగా 20 లక్షలు, మరో యువకుడి నుంచి 40 లక్షల రుపాయలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. బెజవాడకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగినికి ఈ నెల 5న వాట్సాప్ నెంబర్ ద్వారా మేసేజ్ వచ్చింది.…
Cyber Crime : దేశ రాజధాని ఢిల్లీకి 80 కిలోమీటర్ల దూరంలోని ‘మేవాత్’లో సైబర్ నేరగాళ్లపై హర్యానా పోలీసులు భారీ చర్యలు తీసుకున్నారు. ఇక్కడి 14 గ్రామాల్లో పోలీసులు దాడులు చేసి 100 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు.