Hyderabad:మనలో చాల మంది ఉద్యోగం చేస్తూ, చదువుకుంటూ రూమ్ తీసుకుని ఉంటాం. అయితే ఒక్కరే రూమ్ తీసుకుంటే అద్దె భారం, ఇక మిగిలిన ఖర్చు ఒకరిపైనే పడుతుంది. అలానే కొందరు ఒకరే ఉండలేరు. అందుకని స్నేహితులతో కలిసి రూమ్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కూడా ఓ మహిళ తో కలిసి రూమ్ షేర్ చేసుకున్నాడు. కాగా రూమ్ మేట పైనే కేసు పట్టారు ఆ వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివారాలోకి వెళ్తే.. సి.కిరణ్‌కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వెంగళ్‌రావు నగర్ శ్రీకృష్ణానగర్‌లో దాదాపు ఒక సంవత్సరం క్రితం ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు.
Read also:Anasuya : డీప్ బ్లౌజ్ లో ఇబ్బంది పడిన అనసూయ..
కాగా తనతో రూమ్ షేర్ చేసుకోవడానికి ఎవరికైనా ఆసక్తి ఉంటె తనని సంప్రదించాల్సిందిగా ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన చూసిన ఓ మహిళ తన తో రూమ్ షేర్ చేసుకోవడం తనకి ఇష్టమే నంటూ వచ్చి గది లో చేరింది. ఆ తరువాత ఇద్దరు కూకట్‌పల్లికి మకాం మార్చారు. అయితే కొంత కాలం తరువాత తానొక వేశ్యనని మహిళ చెప్పింది. దీనితో ఆమెను రూమ్ ఖాళి చేయాల్సిందిగా కోరాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు.. అలానే ఇద్దరు సన్నిహితంగా ఉన్న ప్రయివేట్ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానంటూ బెదిరించింది. అలానే తనపై లైంగిక దాడిచేసాడంటూ కిరణ్ పైన పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read also:Delhi air pollution: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ
ధీరునితో కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ షీ బృందం ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత అతడి నుంచి రూ.4.7లక్షలు పరిహారం కింద తీసుకుంది. అంతటితో ఆ మహిళ ఆగలేదు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్ చేసింది. దీనితో కిరణ్‌కుమార్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వాటిని తొలగించారు. కాగా ఈనెల 13 వ తేదీ రాత్రి 9గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులతో అతడిపై దాడిచేయించింది ఆ మహిళ. దీనితో బుధవారం రాత్రి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.