Cyber Fraud: సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్త మోసాలతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో రోజుకో కొత్త తరహా సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది స్కామర్లు సులభంగా డబ్బు సంపాదించడానికి మోసాలబాట ఆశ్రయిస్తున్నారు. అమాయక ప్రజల విశ్వాసాన్ని మాయమాటలతో దోచుకుంటున్నారు. బహుమతులు, కేవైసీ అప్ డేట్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ఓఎల్ ఎక్స్, లాటరీల పేరుతో మోసం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళకు సైబర్ నేరగాళ్లు కాల్ చేశారు. ఆమో ఉద్యోగం వస్తుందని ఆశపడింది. అయితే వారు ఆమె ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్నట్లు భావించిన కేటుకాళ్లు ఆ మహిళ నుంచి డబ్బులు కాజేసేందుకు ప్లాన్ వేసారు. ఉద్యోగం మీకు తప్పకుండా వస్తుంది. కానీ ఒక టాస్క్ పూర్తి చేయాలని నమ్మించారు. అయితే వారి మాటలు నమ్మిన మహిళ వాళ్లు చెప్పినట్లు చేసుకుంటూ పోయింది. అంతే తన ఖాతాలో వున్న రూ. 1.09 లక్షలు కట్ అయ్యాయి. వాళ్లు మాట్లాడుతున్న కాల్ కట్ అయ్యింది. అంతే వారిమాటలు విని మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
కరీంనగర్‌కు చెందిన ఓ మహిళ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఒకరోజు ఆమెకు తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించారు. అంతే కాకుండా ఉద్యోగానికి అర్హత సాధించాలంటే కొన్ని పనులు పూర్తి చేయాలని చెప్పారు. అర్హత సాధించగానే ఆమె బ్యాంకు ఖాతాలో కొంత డబ్బు జమ అయింది. దీంతో ఆ స్త్రీని నమ్మారు. ఆ తర్వాత పనులు ఇచ్చే ముందు కొంత నగదు జమ చేయాలన్నారు. నిందితులు టాస్క్ పేరుతో పలుమార్లు ఆమె నుంచి రూ.1.09 లక్షల నగదు. పెట్టుబడి పెట్టి గెలిచిన డబ్బును వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయగా.. వారికి ఫోన్ చేసినా స్పందన లేదు. చివరకు మోసపోయానని గ్రహించిన బాధితురాలు కరీంనగర్ అక్టో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడు పశ్చిమ్ బంగ్లాకు చెందిన మోసిన్ కమల్‌గా గుర్తించారు. ఓ బృందం అక్కడికి వెళ్లి విచారించగా.. గుర్తుతెలియని వ్యక్తి రూ.15 వేలు ఇచ్చి బ్యాంకు ఖాతా తీసుకున్నట్లు ట్విస్ట్ ఇచ్చాడు. పోలీసులు మోసిన్ కమల్ ను అరెస్ట్ చేసి కరీంనగర్ తీసుకొచ్చారు. గురువారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానాస్పద ఫేక్ కాల్స్ తీయకపోవడమే మంచిదన్నారు. లింకులు, మెసేజ్ లతో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అవసరమైతే ప్రజలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
Singareni: సింగరేణి కార్మికులకు దసరా బోనస్.. ఈనెల 16న ఖాతాల్లో 1.53 లక్షలు