భారత్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. 2021 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబర్ 31వ తేదీ వరకు రూ. 10319 కోట్ల మొత్తాన్ని వారు కొట్టేశారు. ఈ విషయాన్ని భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం (ఐ4సీ) తెలిపింది. బాధితులు కోల్పోయిన మొత్తంలో 1,127 కోట్ల రూపాయలను సక్సెస్ ఫుల్ గా నిలిపివేసినట్లు ఐ4సీ డైరెక్టర్ రాజేశ్ కుమార్ వెల్లడించారు. దీంతో 9 నుంచి 10 శాతం సొమ్మును బాధితుల ఖాతాల్లోకి తిరిగి జమ చేసినట్లు పేర్కొన్నారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ)లో 2021లో 4. 52 లక్షలకు పైగా నేరాలు రికార్డ్ అయినట్లు తెలిపారు.
Read Also: Bandi Sanjay: బండి సంజయ్‌కి BJP కీలక బాధ్యతలు.. కిసాన్ మోర్చా ఇంఛార్జ్‌గా నియామకం
కాగా, 2022లో కేసుల సంఖ్యలో 113.7 శాతం పెరుగుదలతో 9. 66 లక్షలకు చేరింది. ఇక, 2023లో ఏకంగా 15. 56 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ప్రతి లక్ష జనాభాకు 129 సైబర్ కేసులు నమోదు అయ్యాయి. దాదాపు 50 శాతం సైబర్ దాడులు కంబోడియా, వియత్నాం, చైనా తదితర దేశాల నుంచే జరిగినట్లు ఐ4సీ వెల్లడించింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల నుంచి పని చేసే వారు ఆన్‌లైన్ బుకింగ్, ఓఎల్‌ఎక్స్ లాంటి మార్గాల ద్వారా ఎక్కువగా ఈ మోసాలు జరిగాయి.
Read Also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
అలాగే, ఈ-కేవైసీ గడువు ముగింపు, మాల్‌వేర్ వాడడం ద్వారా ఝార్ఖండ్ ముఠాలు ఎక్కువ మందిని బురిడీ కొట్టించాయి. సైబర్ బాధితులు తమ డబ్బును ఈజీగా క్లెయిమ్ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందిస్తోంది.. వాటిని త్వరలోనే అమల్లోకి తీసుకు వస్తామని ఐ4సీ డైరెక్టర్ రాజేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం బాధితులు తమ డబ్బును తిరిగి పొందాలంటే కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకురావాల్సి ఉందన్నారు.