Cyber Crime: వృద్ధ దంపతులను కోట్ల రూపాయలు వస్తాయని ఎర చూపి రూ.4 కోట్లు మోసం చేశారు. ఓ యువతి ముందుగా బాధితురాలిని ఫోన్‌లో పూర్తిగా నమ్మించింది. ఆ తర్వాత బ్యాంకు వివరాలు తెప్పించుకుని కోట్లాది రూపాయలను మోసం చేసిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తాను ఈపీఎఫ్ డిపార్ట్ మెంట్ తో మాట్లాడుతున్నానని ఫోన్ చేసి యువతి చెప్పిందట. ఆపై తన పాన్ కార్డ్ నంబర్, రిటైర్మెంట్ తేదీ, కంపెనీ పేరు చెప్పి ఆమె భర్తను కూడా నమ్మించింది. ఆ తర్వాత తనకు రూ.11కోట్లు వస్తాయని నమ్మబలికింది.
Read Also:Medigadda Barrage: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఇష్యూ.. కేటీఆర్ ఏమన్నారంటే..!
70 ఏళ్ల వృద్ధ జంటను నాలుగు నెలల్లోనే రూ.4 కోట్ల సైబర్ మోసానికి పాల్పడ్డారు. ఈ విషయం దక్షిణ ముంబై ప్రాంతానికి చెందినదిగా చెబుతున్నారు. తనకు ఓ యువతి నుంచి కాల్ వచ్చిందని మోసానికి గురైన బాధితురాలు ఆరోపించింది. ఆమె ఈపీఎఫ్ డిపార్ట్‌మెంట్ నుండి మాట్లాడుతున్నట్లు ఫోన్‌లో పేర్కొన్నారు. ఫోన్ చేసిన అమ్మాయి తన భర్త పనిచేసే కంపెనీ పేరు కూడా చెప్పింది. అది నమ్మిన ఆమె పాన్ కార్డ్ నంబర్, పూర్తి పదవీ విరమణ వివరాలను కూడా యువతికి ఇచ్చింది.
Read Also:US Gun Firing: అమెరికాలో దుండగుల కాల్పులు.. 22 మంది మృతి!
తన భర్త కంపెనీ పెట్టుబడి కోసం రూ. 4 లక్షలు భవిష్యనిధిలో ఉంచారని.. అది 20 ఏళ్ల తర్వాత మెచ్యూర్ అయ్యిందని, ఇప్పుడు రూ. 11 కోట్లు పొందేందుకు అర్హుడని యువతి ఫోన్‌లో మహిళకు చెప్పింది. దీని తర్వాత మహిళ TDS, GST, ఆదాయపు పన్ను చెల్లింపు కోసం డబ్బును బదిలీ చేయమని కోరింది. యువతి బ్యాంకు వివరాలు చెప్పడంతో కొద్దిసేపటికే ఆమె ఖాతా నుంచి రూ.4 కోట్లు మాయమయ్యాయి. మోసాన్ని గుర్తించిన దంపతులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ మోసం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. అత్యాశతో బ్యాంకుకు సంబంధించిన వివరాలను ఎవరితోనూ పంచుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.