పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కాల్పుల విరమణ ఉల్లంఘనను వార్తలను ఖండించింది. పూర్తి నిజాయితీతో కాల్పుల విరమణను అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అయితే.. భారతదేశం వైపు నుంచి ఉల్లంఘన సంఘటనలు జరిగాయని ఆరోపించింది. వాటిని పాకిస్థాన్ సైన్యం బాధ్యతాయుతంగా, సంయమనంతో నిర్వహించిందని పేర్కొంది. కాల్పుల విరమణ సజావుగా అమలు చేయడంలో ఏమైనా సమస్యలు తలెత్తే.. చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తాము…
సరిహద్దుల్లో నగ్రోటా వద్ద చొరబాటుకు పాక్ యత్నించింది. పాక్ చొరబాటుదారులపై భారత రక్షణ దళం కాల్పులు జరిపింది. చొరబాటు దారులు సైతం కాల్పులు జరపగా.. ఓ ఇండియన్ ఆర్మీ జవాను గాయపడ్డారు. ప్రస్తుతం రక్షణా దళాలు చొరబాటుదారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ విషయాన్ని భారత సైన్యం వైట్ నైట్ కార్ప్స్ ట్వీట్ ద్వారా తెలియజేసింది.
జమ్మూ కశ్మీర్‌లోని పాకిస్థాన్ సరిహద్దులో జరిగిన క్రాస్ కాల్పుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్)కి చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ అమరులయ్యారు. బీఎస్ఎఫ్ ట్వీట్ ద్వారా ఆయన బలిదానాన్ని ధృవీకరించింది. మహ్మద్ ఇంతియాజ్ అత్యున్నత త్యాగానికి వందనం సమర్పించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. మే 8 మరియు 9 తేదీల మధ్య రాత్రి జరిగిన షెల్లింగ్‌లో మహ్మద్ ఇంతియాజ్ గాయపడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని.. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. సరిహద్దు పొడవునా పాక్ ఉల్లంఘనలకు పాల్పడిందని వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని. ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. కాల్పుల విరమణ ఉల్లంఘనపై తక్షణ చర్యలు తీసుకోవాలని పాక్‌కు సూచించినట్లు వెల్లడించారు. సైన్యం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని, కఠిన చర్యలు తీసుకోవాలని సూచనలు ఇచ్చామన్నారు. కొన్ని గంటలుగా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని చెప్పారు.…
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తతను పరిష్కరించడానికి అమెరికా మధ్యవర్తిత్వంలో ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. అయితే.. కాల్పుల విరమణ ప్రకటించిన నాలుగు గంటల తర్వాత.. పాకిస్థాన్ సైన్యం మళ్లీ భారత్‌లోని పలు ప్రాంతాల్లో దాడులకు దిగినట్లు తెలుస్తోంది. తాజాగా జమ్మూ కశ్మీర్‌లో పాక్ డ్రోన్ దాడులకు తెగబడుతున్నట్లు సమాచారం.
Samba : భారత-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండగా, గురువారం రాత్రి సాంబా సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు గుండా చొరబాటుకు తెగబడిన ఉగ్రవాదులకు భారత జవాన్లు నరకం చూపించారు. అప్రమత్తమైన సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) జవాన్లు జైషే మహమ్మద్‌కు చెందిన 10 నుంచి 12 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. హతమైన ఉగ్రవాదుల సంఖ్యపై అధికారులు ఇంకా స్పష్టమైన ప్రకటన చేయనప్పటికీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది కేవలం చొరబాటు ప్రయత్నం మాత్రమే కాదు, పాకిస్తాన్…
జమ్మూ కశ్మీర్‌లోని సాంబాలో ఒక పెద్ద చొరబాటు ప్రయత్నాన్ని బీఎస్‌ఎఫ్ భగ్నం చేసింది. ఎల్‌ఓసీలోని కొన్ని ప్రాంతాల్లో పాకిస్థాన్ వైపు నుంచి పెద్ద ఎత్తు కాల్పులు జరుగుతున్నాయి. భారత ఆర్మీ తగిన సమాధానం ఇస్తోంది. అయితే.. భారత్‌లో అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఆర్మీని పాక్ అడ్డుకుంది. అర్ధరాత్రి జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LOC) దగ్గర పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఆ ప్రాంతమంతా చీకటి అలుముకుంది.
India vs Pak : ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత-పాకిస్తాన్ నియంత్రణ రేఖ (LoC) వద్ద పరిస్థితి తీవ్రంగా మారింది. పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడ్డ విషయం అధికారికంగా భారత సైన్యం ధృవీకరించింది. ఈ కాల్పుల్లో భారత జవాన్ దినేష్ కుమార్ వీరమరణం పొందారు. దినేష్ కుమార్ మృతిపై వైట్ నైట్ కార్ప్స్ సంతాపం తెలియజేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఇదే కాల్పుల్లో సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.…