జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ సుడిగాలులు( వాటర్ స్పౌట్) బీభత్సం సృష్టించాయి. పలిమెల మండలంలోని లెంకలగడ్డలో గోదావరి పరివాహక అటవీ ప్రాంతంలో సుడిగాలుల ఏర్పడడంతో భారీగా చెట్లు ,మిర్చి, పత్తి పంటలు నెలకొరిగాయి. గత సంవత్సరం సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు మూడు సార్లు ప్రకృతి విలయతాండవం చేయడం సంచలనంగా మారింది. అయితే గత సంవత్సరం సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో ములుగు జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో బీభత్సం చోటు చేసుకోగా తాజాగా లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో…
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు అలజడి సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేస్తున్నాయి.. బీభత్సం సృష్టిస్తున్నాయి.. కురుపాం మండలంలోని గిరిశిఖర ప్రాంతంలో ఒక గుంపు, జియ్యమ్మవలస, కొమరాడా, గరుగుబిల్లి మండలాలలో ఒక గుంపు గిరిజనులకు, రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ అంశంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై రెండు మూడు రోజుల్లో స్పందిస్తానని తెలిపారు. పదేళ్ళపాటు సీఎంగా ఉన్నాను... కచ్చితంగా క్లారిటీ ఇస్తానని కరీంనగర్ పర్యటనలో ఉన్న ఆయన సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో చిట్ చాట్ లో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిజానిజాలు బయటపెడతానని కేసీఆర్ పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. చేనేత కార్మికులకు ఉపాధి ఇవ్వాలని అంటే.. ఓ కాంగ్రెస్ మంత్రి నిరోధ్లు, పాపడాలు అమ్ముకుని బతకమని అంటున్నారని కేసీఆర్ తెలిపారు. చేనేత కార్మికులు నిరోధ్లు అమ్ముకోవాలా కుక్కల కొడుకుల్లారా అంటూ విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో తామేమి రనౌట్ కాలేదు.. తమకంటే కాంగ్రెస్ కు 1.5 శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయని తెలిపారు. ఆ ఒకటిన్నర శాతం ఓట్లు కూడా తులం బంగారం, ఆరు…
కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పొలంబాట కార్యక్రమంలో భాగంగా ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల ఈ పరిస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వ మాటలు అన్నీ మోసాలు.. అబద్ధాలు.. ఒక్క హామీ నెరవేరలేదని తెలిపారు. అసమర్థులు, చవట దద్దమ్మలు పాలనలో ఉన్నారు కాబట్టి ఈ స్థితి వచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో…
లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రైతులతో మమేకమవుతున్నారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా.. కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తున్నారు. పొలంబాట కార్యక్రమంలో భాగంగా.. ముగ్ధుంపురంలో ఎండిపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించారు. నీటి సమస్యలపై రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టంపై కేసీఆర్ ఆరా తీశారు. అయితే.. సాగునీటికి తీవ్ర ఇబ్బంది అవుతుందని రైతులు కేసీఆర్ కు తెలిపారు. గతేడాది నీరు సమృద్ధిగా ఉండేదని.. ఇప్పుడు పొలమంతా ఎండిపోయిందని…
Traders Protest on Basmati: దేశంలోని పలు రాష్ట్రాల్లో బియ్యం వ్యాపారులు నిరసనకు దిగారు. ఇది హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. నిరసన కారణంగా దాదాపు 300 హోల్‌సేల్ మార్కెట్లలో బాస్మతి కొనుగోలు నిలిచిపోయింది.
వానాకాలం పంటల పరిస్థితి, రబీ సాగుకు సన్నద్దం, రుణమాఫీ అమలు, ఆయిల్ ఫామ్ సాగుపై సచివాలయంలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, సీఎం నిర్లక్ష్యం వల్లే లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి అని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇసుక మేటలు పెట్టారు.. అన్నారం, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో బ్యాక్ వాటర్ వల్ల వేల ఎకరాల పంటలు మునుగుతున్నాయి.
రసాయనిక ఎరువులు వాడితే ఎక్కువ దిగుబడులు వస్తాయని చాలా మంది రైతులు భావిస్తున్నా ఆ పరిస్థితి లేదు. రైతు సోదరులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తేనే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. ఇందుకోసం ఆవు పేడ, వర్మీకంపోస్టును ఎరువుగా ఉపయోగించాలి. ఇప్పుడిప్పుడే రైతాంగం సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తోంది. సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేసే పండ్లు మరియు కూరగాయల ధర కూడా చాలా ఎక్కువ. అంతేకాకుండా ప్రభుత్వం కూడా సేంద్రియ వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహిస్తోంది.