గత నెల 25న జరిగిన హత్యకేసును శ్రీకాకుళం పోలీసులు చేధించారు. శ్రీకాకుళం టౌన్ సమీపంలోని విజయాదిత్య పార్క్ లో హత్యకు గురయ్యాడు మాజీ ఆర్మీ ఉద్యోగి చౌదరి మల్లేశ్వరరావు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విభేదాలే హత్యకు కారణమని తేల్చారు పోలీసులు. మల్లేశ్వరరావును హతమార్చాడు సొంత బావమరిది సీపాన అప్పలనాయుడు. విజయాదిత్య పార్క్ కు పిలిపించి మరో ఐదుగురితో కలిసి హత్య చేసాడు అప్పలనాయుడు. ఈ హత్యకు ఆరులక్షల ఒప్పందం చేసాడు. ముందుగా 4 లక్షలు అడ్వాన్స్ చెల్లించాడు.…
హైదరాబాద్ లెమన్ ట్రీ హోటల్‌లో ప్రేమ జంట ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నమే రూమ్ ఖాళీ చేసి వెళ్లాల్సి ఉండగా.. మరోరోజు ఉంటామని చెప్పినట్లు హోటల్ సిబ్బంది చెబుతున్నారు.మృతులు మహబూబ్‌నగర్‌కు చెందిన రాములు, సంతోషి గా గుర్తించారు. రూమ్ బాయ్ వెళ్లినప్పుడు ఇద్దరూ గొడవ పడుతున్నట్టు సమాచారం. కోపంతో సంతోషి గొంతుకోసి బాత్‌రూమ్‌లో పడేసిన రాములు… తర్వాత ఫ్యాన్‌కు…
లిబియాలో శరణార్థులతో వెళుతున్న ప్రమాదవశాత్తు ఓ పడవ బోల్తా కొట్టింది. అయితే… ఈ ప్రమాదంలో ఏకంగా 57 వరకు శరణార్థులు మరణించి ఉంటారని యూఎన్ మైగ్రేషన్ కు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి గురైన ఆ పడవ లిబియా దేశం పశ్చిమ తీర పట్టణం ఖుమ్స్ నుంచి ఆదివారం రోజున బయలు దేరిందని అంతర్జాతీయ వలస దారుల సంస్థ లో ఉన్న కీలకమైన అధికారి సఫా మెహ్లీ అంటున్నారు. ఈ ఘోర ప్రమాదం చోటు…
హిమాచల్ ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. పలు కార్లు ధ్వంసం అయ్యాయి. గత వారం హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. కాగా, దీని ప్రభావం వలన ఇప్పుడు కొండచరియలు విరిగిపడుతున్నాయి. కిన్నౌర్ జిల్లా సంగాల్ లోయ ప్రాంతానికి నిత్యం వందలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ఇక వీకెండ్‌లో తాకిడి ఎక్కువగా ఉంటుంది. కరోనా…
ప్రముఖ గాయనిని వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. గాయని పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసిన నిందితుడు… యూట్యూబ్ ఛానల్ లో అశ్లీల కంటెంట్ అప్లోడ్ చేశాడు. ఫేస్ బుక్, ఇన్ స్టా లో సైతం గాయని పేరుతో ఖాతా ఓపెన్ చేసి… గాయని ఫోటోతో ఫిల్మ్ ప్రొడక్షన్ మొదలుపెట్టాడు నిందితుడు. ఈ విషయం తెలిసిన సింగర్ కుటుంబం షాక్ కు గురైంది. నిందితుడికి ఫోన్ చేసి సోషల్ ఖాతాలు తొలగించాలని కోరిన సింగర్… దానికి…
అమెరికాలోని లాస్ ఎంజెలిస్‌లో ఓ వ్యక్తి అర్ధరాత్రి అలజడి సృష్టించాడు. దాదాపుగా నగ్నంగా ఉన్న ఓ వ్యక్తి బోయిల్ హైట్ ఏరియాలోని సెయింట్ మేరీ క్యాథలిక్ చర్చిపైకి ఎక్కి శిలువకు నిప్పు అంటించాడు. ఆ తరువాత అక్కడి నుంచి మరో బిల్డింగ్‌పైకి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చర్చి శిలువకు నిప్పు అంటించినప్పటికీ ఆ మంటలు పెద్దగా అంటుకొకపోవడంతో అంతా ఊపిరి…
విశాఖ జిల్లాలో వాహనాలపై నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కుప్పకూలింది. అనకాపల్లి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రెండు కార్లు, ఓ ట్యాంకర్ ధ్వంసం కాగా.. ఇద్దరు మృతి చెందారు. హైవే విస్తరణ కోసం ఫ్లై ఓవరన్ నిర్మిస్తున్నారు. బీంలు పెద్ద శబ్దంతో కూలడంతో అక్కడి జనం పరుగులు తీశారు. ఇక ప్రమాదంలో పలుగురికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. read also : ఈటల నోటి వెంటరాని జై…
రంగారెడ్డి : రాజేంద్రనగర్ మైలార్ దేవిపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోటర్ సైకిల్ ను సిమెంట్ రెడీ మిక్స్ లారీ ఢీ కొట్టింది. దీంతో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ చక్రాల కింద ముగ్గురు యువకులు నలిగిపోయారు. మైలార్ దేవిపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ రోడ్డు ప్రమాదం ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు… హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రోడ్డు…
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ (హెరాయిన్) పట్టుబడింది. కాబూల్ నుండి ఢిల్లీ వచ్చిన ఆఫ్గన్ ప్రయాణీకుడి నుండి 2.4 కోట్ల విలువ చేసే 355 గ్రాముల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా మాదకద్రవ్యాలను సినీ పక్కీలో తరలించే యత్నం చేశాడు ఆ కేటుగాడు. మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు కనిపెట్టకుండా కారు ఇంజన్ లో వాడే పరికరాలలో దాచాడు. read also : తెలకపల్లి రవి…
హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 10 లో నివాసంపై ఇవాళ ఎక్సైజ్ పోలీసుల దాడి చేశారు. ఈ సందర్భంగా డ్రగ్స్ ముఠాలోని ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు… వీరి వద్ద నుండి పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 17 గ్రాముల కొకైన్ తో పాటు, 8 గ్రాముల ఎండిఎంఏ, 73 ఎస్టకి పిల్స్, 15 గ్రాముల చరాస్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.…