రాహుల్ హత్యకేసు ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఐదుగురుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు విజయవాడ పోలీసులు. రాహుల్ తండ్రి రాఘవరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. నిందితుల పై 302, 120 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎ1: కోరాడ విజయ్‌కుమార్, ఏ2: కోగంటి సత్యం, ఏ3: పద్మజ, ఏ4: పద్మజ, ఏ5: గాయత్రీల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదయ్యాయి. జిక్సిన్ సిలిండర్ల కంపెనీ వ్యవహారంలోనే వివాదాలు తలెత్తినట్లు పోలీసులు గుర్తించారు. తన 30శాతం వాటా ఇవ్వాలంటూ రాహుల్‌పై కోరాడ విజయ్ ఒత్తిడి చేసినట్లు పోలీసులు విచారణలో తెల్చారు. కోరాడ కుటుంబసభ్యులకు నేరంలో భాగం ఉందని…ఎన్నికల్లో పోటీచేసి కోరాడ ఆర్థికంగా నష్టపోయాడని రాహుల్ తండ్రి వివరించారు. కోరాడ విజయ్, కోరాడ పద్మజ, గాయత్రి, కోగంటి సత్యం బెరించారన్నారు.