మణుగూరు సింగరేణి ఓపెన్ కాస్ట్ 2 లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎమర్జెన్సీ కోసం తిరిగే బొలెరో వాహనం మీదకు డంపర్ ఎక్కింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మగ్గురు మృతి చెందినట్టు సమాచారం. సింగరేణిలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులతో పాటు బొలెరో డ్రైవర్ కూడా మృతిచెందారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును అంచనా వేస్తున్నారు.
Read: ప్రాణాలకు తెగించి ఆఫ్ఘన్ మహిళలు ఏం చేశారంటే…