గాంధీ ఆస్పత్రిలో జరిగినఅత్యాచార ఘటనలో కొత్త ట్విస్టు వెలుగు చూసింది. మెడికల్ రిపోర్ట్ నమూనా పరీక్షల్లో… మత్తుమందు ప్రయోగం ఆనవాళ్లు కనిపించలేదు. ఇప్పుడీ మెడికల్ రిపోర్టే ఈ కేసులో.. కీలకంగా మారింది. తమకు నిందితులు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది బాధితురాలు. దీంతో బాధితురాలి నుంచి రక్తంతో సహా వివిధ నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించింది ఫొరెన్సిక్ బృందం. వీటిలో క్లోరోఫామ్ సహా ఇతర మత్తు పదార్థాలేవీ కనిపించలేదని.. నివేదిక ఇచ్చింది.ఇప్పటికే బాధిత మహిళ సోదరి కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు. ఆమె బయటకు వెళ్ళే సీసీటీవీ దృశ్యాలను సేకరించిన పోలీసులకు.. ఆ తర్వాత ఆమె ఎటు వెళ్ళిందనే దానిపై స్పష్టత రాలేదు.
Read: మధ్యప్రదేశ్‌కు జ్యోతిరాదిత్య అదిరిపోయే గిఫ్ట్…
అనుమానితులు ఉమామహేశ్వర్‌తో పాటు ముగ్గురు సెక్యూరిటీ గార్డులు.. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. గాంధీ ఆస్పత్రి ఆవరణలోలో అత్యాచారానికి అవకాశమే లేదన్నారు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు. ప్రాథమిక నివేదికలోనూ ఇదే తేలిందన్నారు. ఘటనపై విచారణ జరుగుతోందనీ… సిబ్బందితో సమావేశం నిర్వహించమనీ చెప్పారు. అనుమానితుడు ఉమామహేశ్వర్‌ను ఇప్పటికే సస్పెండ్ చేసినట్టు తెలిపారు రాజారావు. గాంధీ ఆస్పత్రి ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్సయ్యింది. బాధితుల ఫిర్యాదుపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ సీఎస్, డీజీపీ, హోంశాఖ కార్యదర్శి, ఆరోగ్యశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.