Christmas Cake: బ్రెజిల్‌లో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. క్రిస్మస్ కేకులో అత్యంత విషపూరితమైన ‘‘ఆర్సెనిక్’’ని కలిపి ముగ్గురిని చంపేసింది. 61 ఏళ్ల వృద్ధురాలు క్రిస్మస్ కోసం స్వయంగా కేక్ తయారు చేసింది. బ్రెజిల్ దక్షిణ రాష్ట్రమయిన రియో గ్రాండే డో సుల్‌లోని టోర్రెస్‌కి చెందిన టెరెజిన్హా సిల్వా డోస్ అంజోస్ అనే మహిళ కేసు తయారు చేసే సమయంలో ఆర్సెనిక్ కలిపింది.
CRIME: గర్భం దాల్చడం లేదని, ఇలాగైతే తాను నిన్ను వదిలేసి వేరే మహిళను చూసుకుంటానని భర్త చెప్పడం ఆయన హత్యకు కారణమైంది. ఛత్తీస్‌గఢ్ లోని సుర్గుజా జిల్లాలో బుధవారం ఈ హత్య జరిగింది. 28 ఏళ్ల వ్యక్తిని అతడి భార్య గొడ్డలితో నరికి చంపింది. తనకు బిడ్డను కనివ్వకుంటే తానను వేరే మహిళను పెళ్లి చేసుకుంటానని బెదిరించడంతో కోపంతో భార్య అతడిని చంపేసింది.
UP: డబ్బుల కోసం మగాళ్లను పెళ్లాడుతున్న ఓ లేడీ ఖిలాడీని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘నిత్య పెళ్లికూతురు’’ మారిన మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ బండాకి చెందిన ఇద్దరు మహిళలు చాలా మంది మగాళ్లను, ఒంటరి పురుషులను పెళ్లి పేరుతో మోసం చేసి, వారి ఇళ్లలోని నగదు, ఆభరణాలను దొంగిలించే రాకెట్ నడుపుతున్నట్లు తేలింది.
Serial killer: పంజాబ్‌లో గత 18 నెలల వ్యవధిలో 11 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులకు లిఫ్ట్ ఇచ్చి, ఆ తర్వాత వారిని దోచుకుని హత్యలకు పాల్పడుతున్న వ్యక్తిని మంగళవారం రూపనగర్ జిల్లాలో పట్టుకున్నారు. నిందితుడిని హోషియార్‌పూర్ జిల్లాలో గర్‌శంకర్‌లోని చౌరా గ్రామానికి చెందిన 33 ఏళ్ల రామ్ సరూప్‌గా గుర్తించారు.
Crime: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాకు చెందిన ఒక జిమ్ ట్రైన్ RAW (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్‌గా నటిస్తూ.. భారత సంతతికి చెందిన కెనడియన్ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేరంపై జిమ్ ట్రైనర్‌పై పోలీసులు అత్యాచారం, క్రిమినల్ బెదిరింపుల కింద కేసులు నమోదు చేశారు. ఈ లైంగిక దోపిడిలో నిందితడి స్నేహితుడు కూడా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సికంద్రా పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్…
Gun Fire : నాటు తుపాకీ మోత ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఎవరితో విభేదాలు లేవంటున్న ఆ కుటుంబం పై ఇక కాల్పులు జరిపింది ఎవరు? ఇదే వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలింది. పొద్దు పొద్దున్నే సంచలనం సృష్టించిన మిస్టరీగా రాయచోటి కాల్పులు ఘటన ఘటనలు ఇద్దరు గాయపడ్డారు… అయితే వారిద్దరూ చిక్కు వెంట్రుకలు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. చిక్కు వెంట్రుకలు సేకరిం చే వారిపై కాల్పులు జరపాల్సిన అవసరం ఎవరిది? ఎందుకు జరిపారు…
Honeymoon: ‘‘హనీమూన్ డెస్టినేషన్’’కి సంబంధించి మామ అల్లుడి మధ్య గొడవ చివరకు యాసిడ్ దాడికి కారణమైంది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర థానే జిల్లాకు చెందిన 29 ఏళ్ల కొత్తగా పెళ్లయిన వ్యక్తి తన భార్యతో హనీమూన్ కోసం కాశ్మీర్ వెళ్తామనుకున్నాడు. అయితే, దీనిపై వివాదం చెలరేగడం మామ అతడిపై యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటనలో అల్లుడు గాయపడినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
భార్యాభర్తల సంబంధం రోజురోజుకు దిగజారిపోతుంది. కలకాలం కలిసుండాల్సిన దంపతులు.. మధ్యలో పెడదారిన పడుతున్నారు. దీంతో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. క్షణిక సుఖం కొందరు అడ్డదారులు తొక్కి.. మధ్యలోనే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
Murder: నేటి ఆధునిక సమాజంలో సాంకేతికత పెరుగుతోంటే, మానవ సంబంధాలు మరుగున పడుతున్నాయి. ఒకప్పుడు మానవీయతకు, సంబంధాల సమతౌల్యానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు డబ్బు, ఆస్తుల కోసం నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. దుశ్చర్యలకు వెనకాడకుండా వెళ్ళిపోతున్నారు. ఎంతలా అంటే, రక్త సంబంధాలను కూడా వదిలిపెట్టకుండా, తమ దురాశ కోసం మరణాలకు కూడా కారణమవుతున్నారు. ఇటువంటి శోచనీయ సంఘటన పాల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో తండ్రి మరణానంతరం ఆర్థిక లాభాల కోసం జరిగిన ఘర్షణలు ముగ్గురు…
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఓ వ్యక్తి తన భార్యతో గొడవపడి ఇల్లు తగులబెట్టి సజీవ దహనం చేసుకున్న షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ దహనానికి ముందు భార్యపై కూడా పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, స్థానికులు సహా నలుగురు గాయపడ్డారు. ఖమ్తరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాన్‌పురి ప్రాంతంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని బి అమరేశ్వర్రావుగా గుర్తించారు.