Shocking: కిరాతకం.. భార్యని చంపి, కుక్కర్‌లో ఉడికించిన, పొడి చేసిన భర్త..
- భార్యని దారుణంగా చంపిన కసాయి భర్త..
- అనుమానంతో హత్య..
- డెడ్‌బాడీని కుక్కర్‌లో ఉడించినట్లు సమాచారం..
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking: కలకాలం తోడుండాల్సిన భర్తే కసాయి మారాడు. భార్యని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనను పూర్తిగా విచారించిన పోలీసులకు విస్తూపోయే నిజాలు తెలిశాయి. ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, ఆమెను ముక్కలుముక్కలు నరికి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా డెడ్‌బాడీని కుక్కర్‌లో ఉడికించాడు. మిగతా శరీర భాగాలను జిల్లెల్లగూడ చందన చెరువులో పారేశాడు.
Read Also: Enemy Act: సైఫ్ అలీ ఖాన్ రూ. 15,000 కోట్ల ఆస్తి కోల్పోయే అవకాశం.. ‘‘ఎనిమి ప్రాపర్టీ’ అంటే ఏమిటి..?
Also Read
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి మాజీ సైనికుడు. వృత్తి రీత్యా డీఆర్డీవోలో ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ పని చేస్తున్నాడు. జిల్లెల్లగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంటక మాధవి(35)తో నివాసం ఉంటున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ నెల 13న మాధవి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
ఇలా ఫిర్యాదు చేస్తున్న సమయంలో తనకు ఏ విషయం తెలియనట్లుగా గురుమూర్తి అత్తామామలతో కలిసి మీర్‌పేట పోలీస్ స్టేషన్‌కి వచ్చాడు. అయితే, విచారించిన పోలీసులకు సంచలన విషయాలు తెలిసినట్లు సమాచారం. గురుమూర్తి తన భార్యను చంపిన విషయం తెలిసింది. తన భార్యని చంపడానికి ముందు కుక్కను చంపినట్లు తేలింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో పోలీసులు వివరాలు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అత్యంత దారుణంగా భార్యని హత్య చేసినట్లు పోలీసుల విచారణతో తేలింది. భార్యని చంపిన తర్వాత ముక్కలుగా కట్ చేశాడు. కమర్షియల్ సిలిండర్ తీసుకువచ్చి మృతదేహానికి చెందిన ముక్కలను ఉడకబెట్టి, వాటిని ఎండబెట్టి రోకలితో పొడిగా మార్చినట్లు తేలింది. మృతదేహానికి చెందిన పొడిని బకెట్‌లో తీసుకెళ్లి చెరువులో పారేశాడు. నిందితుడు గురుమూర్తి మృతదేహాన్ని పొడిగా మార్చడంతో ఆనవాళ్లు లేకుండా పోయాయి. సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు ఇంట్లోనే మృతదేహాన్ని కోసి కాల్చి వేసి బూడిద చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం మృతదేహానికి సంబంధించిన పొడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!