Lady Don : మోస్ట్ వాండెడ్ గంజాయి డాన్ అంగూర్ బాయి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఆపరేషన్ ధూల్‌పేట్ కింద కార్వాన్‌లో ఎక్సైజ్ పోలీసు బృందం అంగూర్ బాయ్‌ను అరెస్టు చేసింది. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. ధూల్‌పేట్‌లో గంజాయి డాన్‌గా పేరున్న అంగూర్ బాయి పది కేసులలో నిందితురాలిగా ఉన్నట్లు చెప్పారు. కొంతకాలం ఆమె పోలీసుల చేతిలో చిక్కకుండా పరారీలో ఉన్నట్లు చెప్పారు. అంగూర్ బాయిపై గంజాయి అమ్మకాలకు సంబంధించి 3…
Teen Kills Mother: కొడుకుని స్కూల్ వెళ్లాలని నిద్రలేపేందుకు వెళ్లిన తల్లి హత్యకు గురవుతుందని ఎవరు ఊహిస్తారు. కానీ, ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. డిసెంబర్ 03న ఆర్తీ దేవి అనే మహిళ తన 17 ఏళ్ల కొడుకు అమన్‌ని స్కూల్‌కి వెళ్లేందుకు నిద్రలేపింది. కానీ సదరు యువకుడు మానసిక స్థితి బాగా లేదు. తన తల్లిపై కోపంతో బలంగా నేలకోసి కొట్టడంతో తలకు బలమైన గాయం తగిలి మరణించింది.
Instagram Reels: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో దారుణం జరిగింది. ఒక వ్యక్తి తన ముగ్గురు కూతుళ్ల ముందే భార్య గొంతు కోసి హత్య చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌కి బానిస కావడం వల్లే భర్త హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్స్ రీల్స్ చేయడం, దానికి కామెంట్స్ రావడం, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కాల్స్ రావడంతోనే సదరు వ్యక్తి, తన భార్యని చంపేశాడు.
Crime: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎక్స్‌ట్రా క్లాసుల పేరుతో అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది. నిందితుడైన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నగరంలోని చోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోచింగ్ సెంటర్‌లో ఈ దారుణం జరిగింది.
Black magic: ఘజియాబాద్‌లో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్‌లో క్షుద్రవిద్యలు నేర్చుకుని, ఓ వ్యక్తి తల నరికి బలి ఇచ్చిన ఘటన జరిగింది. బాధితుడి పుర్రెని ఉపయోగించి, పూజలు నిర్వహించి ధనవంతులు కావాలనుకున్న నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పుర్రె, ఆయుధాలు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Man Kills Mother: తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో ఓ వ్యక్తి తన తల్లినే హత్య చేశారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. 22 ఏళ్ల యువకుడు తాను ఎంచుకున్న మహిళను పెళ్లి చేసుకోవడానికి తల్లి నిరాకరించింది. తన ఆస్తిపై వారసత్వాన్ని కోల్పోతావని తల్లి బెదిరించడంతో హత్య జరిగినట్లు తెలుస్తోంది. నిందితుడని అరెస్ట్ చేసిటనట్లు పోలీసులు శనివారం తెలిపారు. నిందితుడిని సావన్ అనే వ్యక్తిగా గుర్తించారు. మొదట్లో ఈ నేరాన్ని దోపిడిగా చిత్రీకరించే పనిచేశాడు.
Digital arrest: డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ దేశంలో ఎక్కువ జరుగుతున్నాయి. పోలీస్ అధికారులు, ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులగా ఫోజు కొడుతూ స్కామర్లు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు.
BJP Leader Suicide: గుజరాత్‌లోని సూరత్ నగరానికి చెందిన 34 ఏళ్ల బీజేపీ మహిళా నాయకురాలు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. సూరత్‌లోని వార్డ్ మెంబర్ 30లో దీపికా పటేల్ అనే బీజేపీ మహిళా మోర్చా నాయకులురా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆమె భర్త రైతు, ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు.
కుల రిజర్వేషన్లపై మాట్లాడటం ఏ వర్గానికి వ్యతిరేకంగా పరిగణించబడదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అటువంటి సందర్భంలో SC-ST చట్టం కింద కేసు నమోదు చేయబడదని తెలిపింది. తాజాగా ఓ మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌తో సంబంధాన్ని తెంచుకుంది.
Digital Arrest: ఇటీవల కాలంలో ‘‘డిజిటల్ అరెస్ట్’’ మోసాలు చాలా పెరిగాయి. ఇలాంటి నేరాలు పెరగడంపై ప్రధాని నరేంద్రమోడీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ అధికారుల, పోలీసులుగా నటిస్తూ బాధితులను బ్లాక్మెయిల్ చేసి, అందినకాడికి దండుకోవడాన్ని డిజిటల్ అరెస్టులుగా పిలుస్తారు. బాధితులు ఏం చేయాలో తెలియక ఆ సమయంలో స్కామర్లకు డబ్బులు ఇస్తున్నారు.