Bullet Bike: చెడు సహవాసాలు ఎక్కువ అవుతున్నందనే కారణంగా తల్లిదండ్రులు బుల్లెట్ బైక్ అమ్మేయడంతో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో ఈ ఘటన జరిగింది.
Law student suicide: నోయిడాలో శనివారం లా విద్యార్థి ఏడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలో విద్యార్థి మాజీ ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Kerala: కేరళలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. గత 5 ఏళ్లుగా 64 మంది తనని లైంగికంగా వేధించారని ఓ దళిత బాలిక ఆరోపించింది. దీంతో ఇప్పుడు వారందరిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి పోలీసులు. కౌన్సిలింగ్ సెషన్‌లో తాను ఎదుర్కొంటున్న బాధను బాలిక వెళ్లకక్కింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ఫిర్యాదు మేరకు పతనంతిట్ట పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ దేవాస్ నగరంలో ఒక ఇంట్లో ఫ్రిజ్‌లో మహిళ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఈ కేసులు గతంలో ఈ ఇంట్లో అద్దెకు ఉన్న సంజయ్ పాటిదార్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆభరణాలు ధరించి, చేతులు మెడను కట్టి ఉంచిన స్థితిలో మహిళ డెడ్‌బాడీ కనిపించింది. మహిళ గత సంవత్సరం హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మహిళని పింకీ ప్రజాపతిగా గుర్తించారు.
Couple Suicide: కుటుంబ తగాదాలు భార్యభర్తల ఆత్మహత్యలకు కారణయ్యాయి. ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన అతడి భార్య కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దంపతుల ఏడాది వయసు ఉన్న పాప ప్రస్తుతం అనాథగా మారింది. ఈ సంఘటన ఘజియాబాద్‌లోని లోనీ బోర్డర్ ప్రాంతంలో జరిగింది. విజయ్ ప్రతాప్ చౌహాన్ (32) , అతని భార్య శివాని (28) మధ్య గొడవ విభేదాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
Big Scam: ‘‘పిల్లలు లేని మహిళల్ని గర్భవతిగా చేయడం.’’ ఇదే ఓ ముఠా నినాదం. బీహార్‌కి చెందిన ముఠాను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. నవాడా జిల్లాలోని నార్డిగంజ్ సబ్‌డివిజన్‌లోని కహురా గ్రామంలో ఈ స్కామ్ జరిగింది. సైబర్ స్కామర్లు ‘‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్’’ని నడిపారు. దీని ద్వారా వారు కస్టమర్లను ఆకర్షించి, వారిని బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Pune: పూణేలో మంగళవారం దారుణం జరిగింది. ఓ కంపెనీలో పనిచేస్తున్న మహిళా సహోద్యోగిని వ్యక్తి దారుణంగా పొడిచి చంపాడు. ఈ ఘటన అందరి కళ్ల ముందే జరిగినా, ఒక్కరూ కూడా ఆపేందుకు ప్రయత్నించ లేదు.
Crime: కలకాలం భార్యని కాపాడాల్సిన భర్త దారుణానికి ఒడిగట్టాడు. యూపీలో బులంద్‌షహర్‌లో ఒక వ్యక్తి తన భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయించాడు. ఈ చర్యను వారు వీడియో రికార్డ్ చేశారు. ముగ్గురిపై కేసు నమోదైంది. భర్త తన స్నేహితులకు తనపై అత్యాచారం చేయడానికి అనుమతించాడని ఫిర్యాదులో మహిళ పేర్కొంది. గత మూడు సంవత్సరాలుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లుగా చెప్పింది. తాను గర్భవతినని, తన భర్త సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడని వెల్లడించింది. Read Also: Telangana: “భూభారతి”కి గవర్నర్…
Uttar Pradesh: 8వ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి, తాను ఆర్మీ కెప్టెన్ అని నమ్మిస్తూ ఏకంగా 20 మది మహిళల్ని మోసం చేశాడు. మహిళలతో రిలేషన్ పెట్టుకుని, ఆ తర్వాత డబ్బుతో ఉడాయించే వాడు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాకు చెందిన హైదర్, తనను తాను హిందువుగా, ఆర్మీ ఆఫీసర్‌గా పరిచయం చేసుకుని మహిళల్ని మోసం చేస్తున్నాడు. నిందితుడు 40 ఏళ్ల హైదర్‌ని లక్నోలో అరెస్ట్ చేశారు.
Maharashtra: మేనకోడలు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లి భోజనంలో విషం కలిపాడు. అయితే, అక్కడ ఉన్న వారు చూసి పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మహారాష్ట్ర కోల్హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆహారం ఎవరూ తినలేదని, పరీక్షల కోసం ఫుడ్ శాంపిల్స్ పంపాపని పోలీసులు బుధవారం తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.