Psycho Arrest: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూమకుంటలో దారుణం జరిగింది. ఆ గ్రామంలోని ఓ సైకో రెచ్చిపోయాడు. ఏడేళ్ల చిన్నారిని కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని గ్రామ శివారులోని పెన్నానది ఒడ్డున పాతిపెట్టాడు. తూముకుంటలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న సైకో గంగాధర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారి మృతదేహం కోసం గాలిస్తున్నారు. గతంలో ఇదే గ్రామానికి చెందిన ఓ మహిళను సైకో గంగాధర్ దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. గంగాధర్ మొత్తం మూడు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడు గంగాధర్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
Read Also: Vallabhaneni Vamsi Arrest: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్..
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడి… హత్యలు చేస్తున్న తన భర్త గంగాధర్‌ను కాల్చిపారాయాలని అతని భార్య పోలీసులను వేడుగున్నారు. మహిళలపై సైకో గంగాధర్ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.