Tadepalli: పెళ్లికి అంగీకరించలేదని యువతిపై బ్లేడుతో ప్రేమోన్మాది దాడి
- తాడేపల్లిలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది
- ప్రేమను అంగీకరించలేదని యువతిపై బ్లేడుతో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tadepalli: రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. పోలీసులు ఎన్ని రకాలుగా చట్టాలు తీసుకొచ్చినా.. దేశం అభివృద్ధిలో దూసుకుపోతున్నా మహిళలు, యువతులు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. హత్యలు, యువతులపై అత్యాచారాలతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ ప్రేమోన్మాది. తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. నర్సుగా పని చేస్తున్న కావ్య(23) అనే యువతిపై బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కావ్యకు గాయాలు అయ్యాయి. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన కావ్య తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం కావ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు.
Read Also: Illicit Relationship: మహిళా ఎస్సైతో ఎస్సై రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. చివరకు?
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన కావ్య ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో మూడేళ్లగా నర్సుగా విధులు నిర్వహిస్తోంది. హాస్టల్‌లో ఉంటూ నర్సుగా పనిచేస్తోంది. ఆదివారం సెలవు కావడంతో హాస్టల్‌లోనే ఉంది. ఈ క్రమంలో హాస్టల్‌లో ఉన్న కావ్యను మాట్లాడాలి అని కిందకి పిలిచి బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు ప్రేమోన్మాది క్రాంతి. తాను ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోవాలని క్రాంతి యువతిని కోరాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన క్రాంతి.. తన వద్ద ఉన్న బ్లేడుతో యువతి మెడపై దాడి చేశాడు. భయంతో క్రాంతిని నెట్టే క్రమంలో కావ్య చేతిపైన గాయాలయ్యాయి. యువకుడు పారిపోయేందుకు యత్నించగా.. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇంటర్ నుంచి కావ్యతో క్రాంతికి పరిచయం ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రేమ నిరాకరించటమే కావ్యపై క్రాంతి దాడికి కారణంగా పోలీసులు గుర్తించారు. దాడికి పాల్పడిన క్రాంతిని తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!