Witchcraft: మూఢనమ్మకాలు ముగ్గురి ప్రాణాలను తీశాయి. జార్ఖండ్‌లో మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని నరికి చంపారు. రాష్ట్రంలోని లోహార్డాగా జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. పెష్రార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేక్రాంగ్ బార్టోలి గ్రామంలో బుధవారం రాత్రి ఈ హత్యలు జరిగాయి. మృతులను లక్ష్మణ్ నగేసియా (47), అతని భార్య బిఫాని నగేసియా (45), వారి తొమ్మిదేళ్ల కుమారుడు రాంవిలాస్ నగేసియాగా గుర్తించారు.
కట్టుకున్న మొగుడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కలిసి బతుకుదాం అని నమ్మించి.. అత్యంత దారుణంగా కడతేర్చాడు. చున్నీతో ఉరి వేశాడు కానీ అప్పటికీ చావలేదని.. ఫెన్సింగ్ రాయితో ఛాతీపై మోదాడు. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. భార్యను అత్యంత దారుణంగా చంపేసిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా వెంకన్నగూడలో జరిగింది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు వానరాశి జంగయ్య. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని వెంకన్నగూడ స్వస్థలం. కానీ అతడు చాలా కాలం నుంచి…
బెట్టింగ్ యాప్స్ ఉసురు తీస్తున్నాయి. వీటి మాయలో పడ్డ యువత.. నిండా మునిగి.. అప్పులపాలై ఎవరికి వారే ఉసురు తీసుకుంటున్నారు. మరికొందరు డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. చివరికి సొంత వాళ్లను కూడా చంపేందుకు వెనకాడడం లేదు. అలాంటి ఘటనే యూపీలో జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసగా మారిన కొడుకు.. డబ్బు కోసం కన్నతల్లినే కడతేర్చాడు. మరో వ్యక్తి ఓయో రూమ్‌లో సూసైడ్ చేసుకున్నాడు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న యువతీ యువకులు ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లకు…
Crime In Guntur: వాళ్లిద్దరూ బావామరదళ్లు… పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు… పెద్దలను ఎదిరించి మరీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి ఇష్టంలేని అమ్మాయి సోదరుడు పగ పెంచుకున్నాడు. పక్కా పథకం ప్రకారం.. బావ మర్డర్‌కు స్కెచ్ వేశాడు. తన స్నేహితులతో కలిసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. పెళ్లైన రెండు వారాలకే చెల్లెలికి తీరని వేదన కలిగించాడు. బామ్మర్ది.. బావ బతుకు కోరుతాడు అంటారు. బుడంపాడులో బావ చావు కోరుకున్నాడు ఓ బామ్మర్ది. కానీ గుంటూరు…
Ganja Smuggling: గంజాయి స్మగ్మర్లు తెలివి మీరిపోతున్నారు. పోలీసుల కళ్లుగప్పి తమ దందా సాగించుకునేందుకు ఎన్నెన్నో ఎత్తులు వేస్తున్నారు. కానీ ఒక్కోసారి వారి పాచికలు పారడం లేదు. పోలీసులకు అడ్డంగా బుక్కయిపోతున్నారు గంజాయి పెడ్లర్లు. ఒడిశా నుంచి గంజాయి తీసుకు వస్తున్న స్మగ్లర్లును హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ చూడండి.. ఏసీ బస్సును పోలీసులు తనిఖీ చేశారు. ఏ ఉగ్రవాది కోసమో..లేదా ఏ బాంబు కోసమో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారనుకుంటే పొరపాటే. Rohit Sharma:…
Wife and Husband: ఢిల్లీలో ఓ మహిళ, తన భర్తపై దారుణమైన దాడికి పాల్పడింది. దినేష్ అనే వ్యక్తి తన మదన్‌గీర్ ఇంట్లో నిద్రిస్తుండగా, అతడి భార్య మరిగే నూనె, కారం పొడితో దాడి చేసింది. అక్టోబర్ 3న ఈ దాడి జరిగింది. 28 ఏళ్ల దినేష్ తీవ్రంగా కాలిన గాయాలపాలైన తర్వాత, సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడిపై స్థానిక అంబేద్కర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్…
Illicit affair: సమాజంలో కొందరి ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంటోంది. వావీవరసలు మరిచి ప్రవర్తిస్తున్న తీరు మానవ సంబంధాలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. ఇవి హత్యలకు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. తాజాగా, ఉత్తర్ ప్రదేశ్‌లోని కాస్గంజ్లో కూడా ఇలాంటి ఓ సంఘటన జరిగింది. అత్తగారితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు.
Hyderabad: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఘట్ కేసర్ పరిధిలోని ఔషపూర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పిల్లల పంచాయతీ వల్ల ఏకంగా తండ్రి బలి అయ్యాడు. అయితే, ఇద్దరు చిన్నారులు గొడవ పడడంతో అమీర్ అనే వ్యక్తి మందలించాడు. ఇక, తన కొడుకునే మందలించాడనే కోపంతో అమీర్ ఇంటి మీదకు వెళ్ళి మరీ అలీ అనే వ్యక్తి దాడి చేశాడు.
Crime News: తాను దేవుడినని ఎంత చెప్పినా తల్లి అర్థం చేసుకోవడం లేదు. దీంతో కన్నతల్లినే హతమార్చాడు ఓ యువకుడు. ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో కలకలం రేపింది. ఐతే అతనికి మతిస్థిమితం సరిగా లేదని చెబుతున్నారు. అయినప్పటికీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉంటున్న లక్ష్మీదేవి, భాస్కర్ రెడ్డికి ఒకే ఒక సంతానం యశ్వంత్. కొడుకు పుట్టాడని చిన్నప్పటి నుంచి అతనిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆ…
Crime News: కొత్తగా పెళ్లైంది. సంతోషంగా నవ దంపతులు ఇద్దరూ యువతి ఇంటికి వచ్చారు. ఇంతలోనే చిన్న ఘర్షణ..తిరిగి ఇద్దరూ కలిసి తమ ఇంటికి వెళ్లిపోయారు. కానీ చిన్నగా ఏర్పడ్డ వివాదం కాస్తా.. క్షణికావేశంలో నవ వధువు ఆత్మహత్య చేసుకునే వరకు దారి తీసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఎర్దండిలో జరిగింది. చిన్న కారణంతో ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి సూసైడ్ చేసుకోవడం స్థానికులను కలచివేసింది. ఈ ఘటనలో అసలేం జరిగింది? ఇక్కడ చూడండి.. ఈ…