Gold Scam: పార్వతీపురంలో మన్యం జిల్లాలో బంగారం తాకట్టు పేరుతో భారీ మోసం జరిగింది. గోల్డ్ షాప్ లో తాకట్టు పెట్టిన బంగారం ఇవ్వక పోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి బాధితులు పాల్పడారు.
Bengal Rape Case: బెంగాల్‌లోని దుర్గాపూర్ లో మెడిసిన్ విద్యార్థిని అత్యాచార ఘటన మరవక ముందే, మరో ఘటన కోల్‌కతాలో జరిగింది. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ఆమె క్లాస్మేట్ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడిని సిటీలోని ఆనందపూర్ ప్రాంతం నుంచి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Kukatpally: హైదరాబాద్ నగరంలోని కేపిహెచ్బి కాలనీ రోడ్డు నంబర్ 5 వద్ద అమానుష సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న హాస్టల్లో కొందరు యువకులు స్థానిక కుటుంబంపై దాడి చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్ నంబర్ 5లో నివసిస్తున్న ఒక కుటుంబం తమ ఇంటి ముందు హాస్టల్ యువకులు బైకులు పార్క్ చేస్తున్నారని పలుమార్లు వారిని హెచ్చరించినట్టు, హాస్టల్ మేనేజ్మెంట్కి కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, నిర్వాహకులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు…
Crime News: అడ్డుఅదుపు లేకుండా రోజురోజుకి బంగారం, వెండి ధరలు పెరగడం మనం చూస్తూనే ఉన్నాము. ఇది ఇలా ఉండగా మరోవైపు హైదరాబాద్ సిటీ రాచకొండ, సైబరాబాద్, సిటీ కమిషనరేట్ పరిధిలో ఇటీవల బంగారం, వెండి చోరీలు గణనీయంగా పెరిగాయి. కొంపల్లి, దోమలగూడ, హయత్ నగర్, జవహర్ నగర్, ఇబ్రహీంపట్నం, తార్నాక వంటి ప్రాంతాల్లో వరుసగా గోల్డ్ లేదా సిల్వర్ చోరీ కేసులు నమోదవుతున్నాయి. హయత్ నగర్ పెద్ద అంబర్‌పేట్‌లో ఏకంగా ఒక విల్లాలో దొంగలు చొరబడి…
Beangal Rape case: బెంగాల్ మెడికల్ విద్యార్థిని అత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమెతన బాయ్‌ఫ్రెండ్‌తో బయటకు వెళ్లిన సమయంలో, ఆమెపై అఘాయిత్యం జరిగింది. ఈకేసులో బాధితురాలి బాయ్‌ఫ్రెండ్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులు చెబుతున్నదాని ప్రకారం.. బాధితురాలు తన వాగ్మూలంలో తాను తన బాయ్‌ఫ్రెండ్‌తో బయటకు వెళ్లినప్పుడు నిందితుడు అత్యాచారం చేసినట్లు పేర్కొంది. ఆమె తండ్రి తన ఫిర్యాదులో అతడి పేరును కూడా పేర్కొన్నాడు. ఈ కేసులో ఇది ఆరో అరెస్ట్.
Bengal Rape Case: పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో మెడికల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన సంచలనంగా మారింది. ఒడిశా జలేశ్వర్‌కు చెందిన 23 ఏళ్ల యువతి, దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతోంది. అక్టోబర్ 10న యువతి తన స్నేహితుడి కోసం బయటకు వచ్చిన సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది.
Bengal gang-rape Case: పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది. కోల్‌కతా ఆర్జీకల్ మెడికల్ కాలేజ్ ఘటన మరవక ముందే ఈ సంఘటన చోటు చేసుకుంది. క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన, విద్యార్థిని సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Crime News: హైదరాబాద్ లోని బాలానగర్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి, ఆ తర్వాత భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో మృతురాలు చల్లారి సాయిలక్ష్మీ (27)గా గుర్తించారు అధికారులు. ఆమె భర్త అనిల్ కుమార్ తో కలిసి పద్మారావు నగర్ ఫేజ్–1, బాలానగర్ లో నివాసం ఉంటోంది. సాయిలక్ష్మీకి ఇద్దరు కవల పిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యత…
S*exual Assault: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కుంభకోణం సమీపంలోని ఒక ఆలయం లోపల 13 ఏళ్ల బాలికపై 75 ఏళ్ల ఆలయ పూజారి లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అతడిపై పోక్సో చట్టం కేసు నమోదు అయింది.
UP: ఉత్తర్ ప్రదేశ్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇఫ్తికార్ ఖాన్ పోలీసులు ఎన్కౌంటర్లో హతమయ్యాడు. భోజిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఖాన్ గురించి నిర్దిష్ట సమాచారం తెలిసిన తర్వాత పోలీసులు తెల్లవారుజామున 5.30-6.00 గంటల ప్రాంతంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. కాస్గంజ్ కు చెందిన ఇఫ్తికార్ ఖాన్ పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించబడ్డాడు. ఇతడిపై రూ. లక్ష రివార్డు ఉంది. Read Also: Bihar Elections: పార్టీలకు ఈసీ కీలక ఆదేశాలు..…