Matrimony cheat: మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతుల ప్రొఫైల్స్ కనిపిస్తే చాలు సంబంధాలు కలిపేసుకుంటున్నారా..? తస్మాత్ జాగ్రత్త. ఫొటోలు మాత్రమే యువతులవి. అమ్మాయిల పేరుతో మిమ్మల్ని నిలువునా ఉంచేస్తారు కేటుగాళ్లు. గతంలో ఇదే తరహాలో మోసపోయిన బాధితుడే.. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నాడు. తనలా మరొకరు మోసపోవద్దని అప్రమత్తం చేయాల్సిందిపోయి.. తనకు జరిగిన అన్యాయమే మరికొందరికి జరగాలని మోసాలకు పాల్పడుతున్నాడు. లక్షలు దండుకున్న కేటుగాళ్లు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.
ఆంధ్రప్రదేశ్ కాకినాడలోని సూర్యరావుపేటకు చెందిన వ్యక్తి కోమలి సూర్యప్రకాష్.. షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తుంటాడు. పెళ్లి చేసుకుని సెట్ అవుదామని.. మ్యాట్రిమోని సైట్లో యువతుల కోసం వెతికాడు. ఓ అమ్మాయి ప్రొఫైల్ చూసి ఇష్టపడ్డాడు. పెళ్లి చేసుకోవాలి అనుకుని సంబంధం కలుపుకున్నాడు. కానీ.. యువతి పేరుతో కొందరు కేటుగాళ్లు సూర్యప్రకాష్ ను నిండా ముంచారు. లక్షలు దండుకుని మోసం చేశారు. అయ్యో పాపం అనుకుంటున్నారా..? అంతకు మించిన ఘోరం మరోటి ఉండదు. మోసపోయిన సూర్యప్రకాష్ తనలా మరొకరు మోసపోవద్దని నలుగురిని జాగ్రత్తపర్చాలి. అవగాహన కల్పించాలి. కానీ.. రివర్స్‌లో ఆలోచించాడు. తనకు జరిగిన మోసం మరికొందరికి ఎందుకు జరగకూడదు అనుకున్నాడు. అంతేకాదు.. ఇలాంటి మోసాలు తానే చేస్తే బెటర్ కదా అని భావించాడు. డబ్బుకు డబ్బు… మెంటల్‌గా సాటిస్‌ఫ్యాక్షన్.
Murari 4K: ఇదేందయ్యా ఇదీ.. కొత్త సినిమా కంటే మురారి రీ రిలీజ్ ఎక్కువ కొల్లగొట్టిందే?
వామ్మో.. వీడు సూర్యప్రకాష్ కాదు.. సైకో ప్రకాష్ అనుకుంటున్నారా..? ఇదే నిజం. మోసపోయిన సూర్యప్రకాష్.. కాకినాడకు చెందిన స్నేహితుడు శెట్టి సతీష్ తో జతకట్టాడు. పెళ్లి సంబంధాల పేరుతో మోసాలకు పాల్పడటం స్టార్ట్ చేశారు. ఇందుకు మ్యాట్రిమోని సైట్లను అడ్డాలుగా మార్చుకున్నారు. పలు మ్యాట్రిమోని సైట్లలో గుర్తుతెలియని యువతుల ఫొటోలు అప్లోడ్ చేసి ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్న యువకులకు ఈ ప్రొఫైల్స్ ను పంపుతారు. యువతి ఫొటోలు నచ్చి.. సంబంధం కోసం కాంటాక్ట్ అయిన యువకులతో ముందుగా వీళ్లు మాట్లాడతారు. అమ్మాయి తరఫు బంధువులుగా నటిస్తూ.. మాట్లాడేవాళ్లు. నేరుగా అమ్మాయి నెంబర్ ఇస్తున్నాం.. కాబోయే భార్యతో మాట్లాడుకో అని నెంబర్ ఇస్తారు కేటుగాళ్లు.
యువతి నెంబర్ అనుకుని కాల్ చేస్తున్నారు యువకులు. ఈ కాల్స్‌ను కూడా ఈ కేటుగాళ్లు రిసీవ్ చేసి మాట్లాడతారు. లేడీ వాయిస్ వచ్చేలా ప్రత్యేక యాప్‌లను ఇన్‌స్టాల్ చేసి మాట్లాడేవాళ్లు. ప్రేమగా కవ్వించే మాటలతో యువకులను పూర్తిగా తమ ట్రాప్ లోకి లాగుతారు. కాబోయే భార్య భర్తలు మాట్లాడుకున్నంత చనువు దాకా తీసుకొస్తారు. యువకుడు పూర్తిగా ప్రేమలో మునిగిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అసలు డ్రామా స్టార్ట్ చేస్తారు. అమ్మకు యాక్సిడెంట్ అయ్యిందని.. నాన్నకు హార్ట్ ఎటాక్ అని.. నగలు పోయాయి ఇంట్లో తెలిస్తే తిడతారని.. ఓ స్టార్టప్ బిజినెస్‌లో డబ్బులు నష్టపోయానని.. రకరకాల కారణాలు చెప్పి యువకుడిని డబ్బులు అడుగుతారు. ఎలాగో కాబోయే భార్య కదా.. కట్నం కింద డబ్బులు వస్తాయి కదా అని భావించి.. అడిగినంత డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు యువకులు. తీరా డబ్బులు అందగానే.. కాల్స్‌కి రెస్పాన్స్ ఉండదు. కొన్ని రోజలుకు నెంబరే మనుగడలో ఉండదు. మ్యాట్రిమోని సైట్‌లో యువతి ప్రొఫైల్ లో అడ్రస్ తీసుకుని వెతుకుదామని ట్రై చేస్తే.. ఫేక్ అడ్రస్ ఉంటుంది.
Robbery: మగవాళ్ళంతా దొంగతనాలు.. దొంగలించిన వాటిని ఆడవాళ్లు విక్రయం.. ఎక్కడంటే.?
ఇంకేముంది యువకుడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. యువతి ఫొటో చూసి అట్రాక్ట్ అవడం… పెళ్లి అనగానే ఎగిరి గెంతులేయడం… డబ్బులు అడగగానే వెనకాముందు ఆలోచించకుండా ట్రాన్స్‌ఫర్ చేయడం., తీరా మోసపోయామని తెలిశాక నెత్తికి చేతులు పెట్టుకుని లబోదిబోమని ఏడవటం!! యువకుల అమాయకత్వాన్ని.. పెళ్లి ఆశను క్యాష్ చేసుకుంటున్నారు ఈ కేటుగాళ్లు. ఓ బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు.. కేటుగాళ్ల ఆటకట్టించారు. రాచకొండ పరిధిలో, సైబరాబాద్ పరిధిలో, మహబూబ్‌నగర్ జడ్చర్లలో, రామగుండంలో.. పలువురు బాధితులను ఈ కేటుగాళ్లు ఈ తరహా మోసం చేసినట్లు గుర్తించారు పోలీసులు. సూర్యప్రకాష్, శెట్టి సతీష్‌లను అదపులోకి తీసుకున్నారు. నిందితులపై 406, 419, 420, 66సీ, 66 డీ యాక్ట్‌ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. నిందితులు 34 లక్షల రూపాయల వరకు దండుకున్నట్లు గుర్తించారు.