దొంగిలించిన మద్యం పంపకం విషయంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో స్నేహితుడినే దారుణంగా హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గోపాల్‌పూర్‌లో జరిగింది. ఈ కేసు వివరాలను తాండూర్ డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి వెల్లడించారు.
Gujarat: గుజరాత్లో దారుణం జరిగింది. మనవడిని కంటికి రెప్పలా, ప్రేమగా చూసుకోవాల్సిన బామ్మే కసాయిగా మారింది. 14 నెలల చిన్నారిని చిత్రహింసలకు గురిచేసి చంపింది. రాష్ట్రంలోని అమ్రేలి తాలుకాలో ఈ ఘటన జరిగింది. నిందితురాలైన మహిళ మనవడు నిరంతరం ఏడుస్తున్నాడనే కోసంతో అతడిని తీవ్రంగా కొట్టింది. అనంతరం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Karnataka: కర్ణాటకలో బీదర్‌లో 18 ఏళ్ల యువతిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. బాధిత యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నగరవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసుకి సంబంధించి పోలీసులకు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. యువతి ఆగస్టు 29న తప్పిపోయింది, సెప్టెంబర్ 01న గుణతీర్థవాడిలోని ప్రభుత్వ పాఠశాలకు సమీపంలోని పొదల్లో ఆమె మృతదేహం లభించింది.
Big Breaking: దేశంలోని ప్రముఖ సైకిళ్ల తయారీ కంపెనీ అట్లాస్ మాజీ చైర్మన్ సలీల్ కపూర్ మంగళవారం (సెప్టెంబర్ 3) ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం విచారణ జరుపుతోంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. Minister Ponguleti: ముందస్తు చర్యల వల్ల మూడు వేల మందిని రక్షించాం.. అట్లాస్ సైకిల్ మాజీ…
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం జరిగింది. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడు షేక్ ముగ్దమ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Haryana: హర్యానాలో దారుణం జరిగింది. గోవుల స్మగ్లర్లుగా భావించి, గో సంరక్షకులు కారును వెంబడించి హత్య చేశారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 23న జరిగిన ఈ దాడిలో నిందితులను నిల్ కౌశిక్, వరుణ్, కృష్ణ, ఆదేశ్ మరియు సౌరభ్‌లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Loan Recovery Agents: లోన్ రికవరీ ఏజెంట్లు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నారు. బ్యాంక్ రుణం చెల్లించకపోవడంతో కుటుంబాన్ని వేధించారు. చివరకు కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని హాపూర్‌లో చోటు చేసుకుంది. సోమవారం 18 ఏళ్ల కుమార్తెతో సహా దంపతులు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. లోక్ రికవరీ ఏజెంట్లు వేధింపులకు గురిచేయడంతోనే వారు ఈ చర్యలకు ఒడిగట్టారని గ్రామస్తులు ఆరోపించారు.
అమెరికాలో వీట్స్ బిజినెస్ పేరుతో సైబర్ మోసం జరిగింది. అధిక లాభాలు వస్తాయని నమ్మించి నేరగాళ్లు 2.1 కోట్లను కాజేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడిని సైబర్ కేటుగాళ్ళు భారీగా మోసం చేశారు.
పూణెలోని ఓ మురికివాడలో గది విషయంలో తలెత్తిన వివాదంతో తమ్ముడు, అతని భార్య తన సోదరిని హత్య చేశారు. ఇద్దరూ కలిసి మహిళ తల నరికి మృతదేహాన్ని నదిలో పడేశారు. ఈ క్రమంలో.. పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు అష్ఫాక్ ఖాన్, అతని భార్య హమిదాగా గుర్తించారు.