రెండు తెలుగు రాష్ట్రాల్లో…సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తూ.. ఫుల్ జోష్ మీద ఉన్నారు. అయితే.. గాలిపటం ఎగురు వేస్తున్న నేపథ్యంలో… ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో 12 ఏళ్ల కుర్రాడు ప్రాణాల మీదకు తీసుకొచ్చింది ఓ గాలిపటం. గాలిపటం ఎగుర వేస్తుండగా… కరెంట్ పోల్ తీగలకు చిక్కింది. విద్యుత్ తీగలకు చిక్కుకున్న గాలిపటాన్ని తీసేందుకు కరెంటు పోల్ ఎక్కాడు ఆ 12 ఏళ్ల బాలుడు.
Read Also: సినిమా వాళ్ల కోసం చిరంజీవి వస్తే రాజకీయాలు చేస్తారా..? మంత్రి బాలినేని
అయితే.. దురదృష్ట వశాత్తు… కరెంటు తీగల నుండి గాలిపటం తీసే క్రమంలో విద్యుత్తు షాక్ గురయ్యాడు ఆ బాలుడు. లైన్‌మెన్ అప్రమత్తతతో ఆ బాలుడికి పెద్ద ప్రమాదం తప్పింది. ఆ బాలుడు కరెంట్ పోల్ ఎక్కింది గమనించిన లైన్ మెన్ వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. అనంతరం.. ఆ బాలున్ని కిందికి దింపాడు. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.