Earthquake: ఇండోనేషియాలో వరసగా భారీ భూకంపాలు.. అసలు కారణాలేంటి.?
- ఆగస్టు 15న ఇండోనేషియాలో రెండు శక్తివంతమైన భూకంపాలు.
- ఫ్లోరెస్ సమీపంలో 7.7 తీవ్రతతో ప్రధాన భూకంపం.
- ఇండోనేషియా నాలుగు ప్రధాన టెక్టానిక్ ప్లేట్ల కూడలి ప్రాంతం.
- టెక్టానిక్ యాక్టివిటీ వల్లే భారీ భూకంపాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: ఇండోనేషియా వరస భూకంపాలతో వణుకుతోంది. ఆగస్టు 15న ఆ దేశంలో రెండు శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. వీటిలో ఫ్లోరెస్ ద్వీపం సమీపంలో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది. ఈ భూకంపాలకు ప్రధాన కారణం, భూగర్భంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు. ఇండోనేషియా ఆస్ట్రేలియన్ ప్లేట్, సుండా ప్లేట్, పసిఫిక్ ప్లేట్, ఫిలిప్పీన్ సీ ప్లేట్ అనే నాలుగు టెక్టానిక్ ప్లేట్ల కలయిక స్థానంలో ఉంది. దీందో ఈ ప్రాంతంలో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి.
ఆగస్టు 15న ఫ్లోరెస్ సమీపంలో సంభవించిన భూకంపం ప్రధానంగా ఆస్ట్రేలియన్, సుండా ప్లేట్ల సంక్లిష్ట పరస్పర చర్యలతో సంబంధాన్ని కలిగి ఉంది. ఆస్ట్రేలియన్ ప్లేట్ ఉత్తరం దిశగా నిరంతరం కదులుతూ సుండా ప్లేట్ కిందకు జారిపోతుంది. ఈ ప్రక్రియను ‘‘సబ్డక్షన్’’ అంటారు. రెండు ప్లేట్లు ఒకదానితో ఒకటి లాక్ అయినప్పుడు వాటి మధ్య భారీ ఒత్తిడి పేరుకుపోతుంది. ఈ ఒత్తిడి దశాబ్ధాలు లేదా శతాబ్ధాలు కొనసాగుతుంది. ఒకానొక సమయంలో భూమిలోని శిలలు ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఒక్కసారిగా విరిగిపోయి భారీ మొత్తంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. ఈ శక్తి భూకంపాలు, సునామీలుగా మనకు కనిపిస్తాయి.
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ఫ్లోరెస్ ప్రాంతానికి పెద్ద భూకంపాల చరిత్ర కూడా ఉంది. 1992లో 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపం, దాని తర్వాత సంభవించిన సునామీ భారీ విధ్వంసానికి కారణమై వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు సుండా-బాంకా ఆర్క్ ప్రపంచంలోనే అత్యంత చురుకైన భూకంప ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. ఇండోనేషియా ‘‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’’ పరిధిలో ఉంటుంది. ఈ ప్రాంతం ఇండోనేషియా నుంచి జపాన్ వరకు విస్తరించి ఉంది. ఇక్కడే అధికశాతంలో భూకంపాలు, అగ్ని పర్వత కార్యకలాపాలు జరుగుతుంటాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..