నేటి సమాజంలో పెరుగుతున్న టెక్నాలజీని మంచికి ఎంతో మంది ఉపయోగిస్తుంటే.. కొందరు మాత్రం టెక్నాలజీని వాడి మోసాలకు పాల్పడుతున్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే మీ డబ్బులు ఎక్కువ అవుతాయంటూ నమ్మబలికి సామాన్యుల జేబుకు చిల్లుపెడుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ముగ్గురు నారపల్లికి చెందిన ఓ వ్యక్తికి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే చాలా డబ్బులు వస్తాయని చెప్పి రూ.85 లక్షల వరకు స్వాహా చేశారు. తీరా…
తెలంగాణలో మరో నిరుద్యోగి నేలకొరిగాడు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని మనస్థాపానికి గురై ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాల్‌గూడకు చెందిన మహ్మద్ అజాజ్ అనే యువకుడు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. అంతేకాకుండా ఉద్యోగం లేకుండా కుటుంబ పోషణ భారమవడంతో డిప్రెషన్లోకి వెళ్లిన అజాజ్ యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా అజాజ్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వైద్యం వికటించి మహిళ ప్రాణాలు కోల్పోయిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓజోన్ హాస్పిటల్ లో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం రాందిగల్ల గ్రామానికి చెందిన ఈదుల అంజనమ్మ (35), ఈదుల కృష్ణయ్య భార్యభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. భర్త కృష్ణయ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూ ఉండగా, అంజనమ్మ వ్యవసాయ కూలీలకు వెళ్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. కాగా అంజనమ్మకు 3 నెలల క్రితం వ్యవసాయ కూలీ పనులు చేస్తుండగా కాలికి…
దీపావళీ పండగ.. స్కూల్ లేకపోవడంతో ఆ బాలుడు ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకుంటున్నాడు. ఇంటిదగ్గర అమ్మ తనకోసం స్వీట్స్ చేసి పెట్టిన విషయం గుర్తుతెచ్చుకొని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరుకున్న బాలుడికి ఇంటి బయట తమ కారు ఊగడం కనిపించింది. దీంతో బాలుడు కారు వద్దకు వెళ్లి చూడగా అతడికి ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే ఉదయ్‌పూర్ జిల్లాకు చెందిన జమ్నాలాల్ శర్మకు హిమాన్షు శర్మ…
జూబ్లీహిల్స్‌లోని హెచ్అండ్ఎం బట్టల షోరూంలో దారుణం చోటు చేసుకోవడంతో ఆ షోరూంకి వెళ్ళాలంటేనే యువతులు భయపడుతున్నారు. ఈ షోరూంపై కేసు నమోదు కావడంతో హెచ్ అండ్ ఎం షోరూం క్లోజ్ చేశారు నిర్వాహకులు. ట్రయల్ రూమ్‌లో ఓ యువతి బట్టలు మార్చుకుంటుండగా పక్క ట్రయల్ రూం నుంచి ఇద్దరు యువకులు మొబైల్ ఫోన్ ద్వారా ఆమె నగ్నఫోటోలను తీసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని పసిగట్టిన యువతి.. చాకచక్యంగా వ్యవహరించి ఆ ఇద్దరి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది.…
టెక్నాలజీ మనుషులకు సుఖాలతో పాటు కష్టాలను కూడా తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా కొందరు టెక్నాలజీని ఉపయోగించి దారుణాలకు పాల్పడుతున్నారు. మొబైళ్ల ద్వారా వీడియో షూట్లు చేసి బెదిరింపులకు పాల్పడటం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటివి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలో జరిగింది. జూబ్లీహిల్స్‌లోని హెచ్అండ్ఎం బట్టల షోరూంలో దారుణం చోటు చేసుకుంది. Read Also: వీళ్లు మనుషులేనా? బాలికపై అత్యాచారం చేసిన తండ్రీకొడుకులు ట్రయల్ రూమ్‌లో ఓ యువతి బట్టలు మార్చుకుంటుండగా పక్క ట్రయల్…
హర్యానాలోని పానిపట్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఓ బాలికపై పొరుగింట్లో ఉంటున్న తండ్రీకొడుకులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే… పానిపట్‌లోని మోడల్ కాలనీలో నివసిస్తున్న బాలిక ఇంటి పక్కనే అజయ్ అనే యువకుడి ఇల్లు ఉంది. దీంతో అజయ్ తరచూ బాలికను ప్రేమిస్తున్నాని వెంటపడుతున్నాడు. కొన్నాళ్లకు అతడి మాయమాటలను నమ్మిన బాలిక అజయ్‌తో ప్రేమలో పడింది. ఈ నేపథ్యంలో ఓ రోజు అజయ్ బాలికను తన ఇంటికి…
ప్రస్తుతం వివాహ బంధంలో ప్రేమ కన్నా అనుమానమే ఎక్కువ కనిపిస్తుంది. ఆ అనుమానంతో భార్యాభర్తలు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. ఇటీవల భార్య అనుమానించిందని ఆమెను, కన్న బిడ్డలని కడతేర్చి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎంతటి సంచలనాన్ని రేకెత్తించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అలాంటి సంఘటనే జర్మనీలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. జర్మనీలోని సోలెంగెన్ పట్టణానికి చెందిన ఒక మహిళకు కొన్నేళ్ల క్రితం ఒక వ్యక్తితో పెళ్ళైంది. వీరికి ఆరుగురు పిల్లలు. ఎప్పుడు…
మామ అంటే తండ్రి తరువాత తండ్రిలాంటివాడు.. కుటుంబాన్ని వదిలి కొడుకు చెయ్యిపట్టుకొని వచ్చిన అమ్మాయికి మరో తండ్రిగా బాధ్యతలు తీసునేవాడే మామ. కొడుకు తప్పుచేస్తే సరిదిద్ది, కోడలు బాధల్లో ఉంటే ఓదార్చేవాడు. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒక మామ మాత్రం నీచానికి ఒడిగట్టాడు. కోడలను ఇంట్లో నుంచి పంపించాడని దారుణానికి పూనుకున్నాడు. వివరాలలోకి వెళితే.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అత్తమామలు, భర్తతో సంతోషంగా ఉండే ఆమె జీవితంలో విధి…
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పామర్రు మండలం కాపవరం వద్ద ఓ కారు అదుపుతప్పి డివైడర్ దాటి బైక్ ను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు దగ్డమైంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మొవ్వ మండలం కాజా గ్రామానికి చెందిన కామేశ్వర రెడ్డి…