హైదరాబాద్‌లో దారుణం.. 13 ఏళ్ల బాలికపై 72 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 72 ఏళ్ల వృద్ధుడు 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం గాదె వీరారెడ్డి (72) అనే వ్యక్తి… బర్కత్‌పురలోని గోకుల్‌ధామ్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్నాడు. 2010లో అతడి ఇంట్లో బాధితురాలి తల్లి పని మనిషిగా పని చేసేది. 2017లో ఆమెను బడంగ్‌పేటలోని తన ఓపెన్ ప్లాట్‌కు వాచ్‌మెన్‌గా నియమించుకున్నాడు. ఆ తర్వాత బాధితురాలి తల్లి, ఆమె మేనమామ ఇద్దరూ కలిసి మీర్‌పేట పీఎస్ పరిధిలోని ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి బాధితురాలి తల్లి, మేనమామ అక్కడే ఉండేవాళ్లు. అయితే బాధితురాలి తల్లి ఇంటి పనులు మానేసి జీవనోపాధి కోసం టైలరింగ్ చేస్తుండేది.
Read Also: వైద్యం వికటించి ఐదు నెలల గర్భిణీ మృతి
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
ఈ నేపథ్యంలో నిందితుడు వీరారెడ్డి తన పుస్తకాలను భద్రపరిచేందుకు సంచులు కావాలన్న వంకతో తరచూ చిన్నారి ఇంటికి వెళ్తుండేవాడు. గత నెల డిసెంబర్‌లో బాధితురాలి తల్లి కుమార్తెను ఇంట్లో వదిలి స్వగ్రామానికి వెళ్లిన సమయంలో వీరారెడ్డి అక్రమంగా ఇంట్లోకి చొరబడి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఊరి నుంచి వచ్చిన తల్లికి బాధితురాలు ఈ విషయం చెప్పడంతో ఆమె మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.
తాజావార్తలు
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!