Auto Driver Selfie Video: ఇటీవల కాలంలో సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ పలువురు ఆత్మహత్యలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా భార్య, అత్త వదినల వేధింపులు భరించలేక ఆటో డ్రైవర్ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలో చోటుచేసుకుంది. మదనపల్లి సీటీఎం మార్గంమధ్యలోని ఎర్రగన్నమిట్ట వద్ద నివాసం ఉండే ఆటో డ్రైవర్ రమేష్‌కు రెండేళ్ల క్రితం శ్రీలత అనే యువతితో వివాహమైంది. పెళ్లి అయినప్పటి నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు…
దక్షిణాఫ్రికాలో 8మంది మోడల్స్ పై గ్యాంగ్ రేప్ దేశంలో సంచనంగా మారింది. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మ్యూజిక్ షూట్ కోసం వెళ్లిన 8మంది మోడల్స్‌పై దుండగులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఇక వివరాల్లో వెళితే.. దక్షిణాఫ్రికా రాజధాని అయిన జోహెన్సెస్‌బర్గ్‌కు పశ్చిమాన ఉన్న క్రూగెర్స్‌డార్ప్ అనే పట్టణానికి కొందరు మోడల్స్ ఓ మ్యూజిక్ షూట్ కోసం అక్కడకు వెళ్లారు. అయితే.. వీరితో పాటుగా కొందరు సహాయక సిబ్బంది సైతం షూటింగ్ జరిగే ప్రాంతానికి వెళ్లారు. ఈనేపథ్యంలో..…
డీజిల్ దొంగతనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పెట్రోల్ పంప్ మేనేజర్ కాల్చి చంపబడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో చోటుచేసుకుంది. లక్నో నుంచి ఢిల్లీకి వెళ్లే జాతీయ రహదారి-24పై ఆగి ఉన్న ట్రక్కు నుండి దొంగలు డీజిల్‌ను దొంగిలిస్తుండగా.. ఆపడానికి ప్రయత్నించిన పెట్రోల్ పంప్ మేనేజర్ ప్రయత్నించాడు. దీంతో తమ వద్ద ఉన్న గన్‌తో దొంగలు అతనిని పట్టపగలే కాల్చి చంపేశారు.
మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతం పడగవిప్పింది. ఎంబీబీఎస్ సీనియర్ విద్యార్థుల బృందం జూనియర్లను అసభ్యకరంగా దుర్భాషలాడుతూ ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్ విద్యార్థుల వివరాలు వెల్లడి కాలేదు.
తమిళనాడు బాలికల ఆత్మహత్యలు ఆవేదన కలిగిస్తున్నాయి. తమిళనాడులో కడలూర్ జిల్లాలో మంగళవారం 12వ తరగతి చదువుతున్న మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రంలో రెండు వారాల్లోనే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
Unknown Dead Body Found At Langar House Musi: హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీ వెనుక భాగంలో మూసీలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులుకు సమాచారం అందించగా.. వెంటనే సంఘటనా స్థలానికి అధికారులు చేరుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించాక ఉస్మానికా మార్చరీకి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎవరైనా చంపి మూసీలో ఈ శవాన్ని పడేశారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? లేక మూసీలో…