Crime News: మ్యాట్రిమోని సైట్ ద్వారా యువతులను పరిచయం చేసుకుని మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. కేరళ రాష్ట్రంలోని పతనంటిట్ట పెరుంబత్తికి చెందిన తేనయంప్లకల్ సాజికుమార్ (47) అలియాస్ మనవలన్ సాజీ మ్యాట్రిమోని వెబ్ సైట్లో ప్రకటనలను చూసి మహిళలకు ఫోన్ చేసేవాడు. తనుకు కోటీశ్వరుడినని చెప్పుకుని యువతులకు గాలం వేసేవాడు. ఏదో ఏదో కారణాలు చెప్పి ఆశ పడ్డ అమ్మాయిలనుంచి డబ్బులు లాగి వారిని మోసగించేవాడు. ఇలా చాలామంది అమ్మాయిలు ఈ మోసగాడి చేతిలో బలైపోయారు. ఈ క్రమంలోనే మావెలిక్కరకు చెందిన యువతి తనను ఓ వ్యక్తి ఆన్లైన్ ద్వారా మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరిపి కొట్టాయం థియేటర్లో పోలీసులు సాజీని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Moga Cyclone: ‘మాండూస్’ ముగిసింది.. ‘మోగా’ మోగిస్తది
అసలేం జరిగిందంటే.. మ్యాట్రిమోనియల్ సైట్‌లో ప్రకటన చూసి సాజీ మావేలికర ప్రాంతానికి చెందిన మహిళను సంప్రదించాడు. తనకు ఉన్నత ఉద్యోగం ఉందని, ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని సాజీ మహిళను నమ్మబుచ్చాడు. ఆన్‌లైన్‌లో నిత్యం టచ్‌లో ఉండే సాజీ ఓ రోజు తన లగ్జరీ కారు ప్రమాదానికి గురైందని, దాన్ని రిపేర్ చేయడానికి రెండున్నర లక్షల రూపాయలు అవసరమని ఆ మహిళకు తెలిపాడు. వెంటనే తిరిగి ఇస్తానని చెప్పడంతో ఆ మహిళ సాజీకి డబ్బు పంపించింది. అయితే డబ్బు అందిన తర్వాత సాజీ మహిళతో సంబంధాలు కట్ చేశాడు. ఫోన్ కాల్స్ , మెసేజ్ లు ఆగిపోవడంతో ఆ యువతి తను మోసపోయినట్లు గుర్తించింది. అందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆ మహిళ సాజీని వ్యక్తిగతంగా కలిసింది లేదు. వీరిద్దరి పరిచయం కేవలం ఆన్ లైన్లో మాత్రమే.
Read Also: Mandous Cyclone : చెన్నైలో చెత్త.. రేయింబవళ్లు తిరుగుతున్న టిప్పర్లు
మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంతలో సాజీ తనకు పంపిన సెల్ఫీని సదరు మహిళ పోలీసులకు అందజేసింది. ఈ సెల్ఫీలో నిందితుడు ధరించిన టీషర్ట్‌పై హోటల్ పేరు రాసి ఉండడంతో నిందితుడి ఆచూకీ కోసం దర్యాప్తు బృందానికి దోహదపడింది. టీషర్ట్‌పై పేరు ఉన్న హోటల్‌ను గుర్తించిన పోలీసులు నిందితుడి గురించిన సమాచారం సేకరించారు. తదుపరి విచారణలో, సాజీ మరో మహిళతో కొట్టాయంలో నివసిస్తున్నట్లు తేలింది. పోలీసులు ఇక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కొట్టాయం, ఎర్నాకుళం, అలప్పుజ, పతనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లోనూ ఇదే తరహాలో సాజీ మోసానికి పాల్పడ్డాడు.