అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల సెక్యూరిటీ, రియల్ బూమ్ ల కు మద్దతు ఇవ్వడం, పైన్ వసూళ్లు చేయడం .. ఈ పనిలో మాత్రమే పోలీసు శాఖ నిమగ్నం అయ్యిందట.. పోలీసు యంత్రాంగం ఏమీ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు రౌడీయిజం పెట్రేగి పోతుంది. చివరకు తుపాకులతో కూడా రౌడీ మూకలు భూ దందాల్లో రంగ ప్రవేశం చేస్తున్నారు. తూ తూ మంత్రం కేసులతో ఏదో కేసు పెట్టామా లేదా అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారంట. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాపితంగా పోలీసు శాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటుంది. ఆ శాఖ పని చేస్తుందా? లేదా అన్నట్లుగా ఉంటుందంట. అందువల్లనే రౌడీయిజం పెట్రోగి పోతుందన్న ప్రచారం సాగుతుంది.
గత రెండు రోజుల నుంచి జరుగుతున్న ఘటనలు పరిశీలిస్తే ఆందోళనలు కలిగిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో గుత్తి కోయల చేతిలో ఫారెస్టు రేంజర్ శ్రీనివాస రావు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మరువకుండా ఇక్కడ భూ తగాదాల్లో ఏకంగా తుపాకులను పెట్టి బెదిరించిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన మీద ఇప్పటి వరకు పోలీసు శాఖ నోరు మెదపడం లేదు. ముల్కలపల్లి మండలం రాజాపురం గ్రామంలో రైతును తుపాకితో బెదిరించిన ఘటన జరిగింది. ఈఘటన జరిగి రెండు రోజులు అవుతున్నప్పటికి ఇప్పటి వరకు నిందితులపై చర్యలులేవు. అదే విధంగా నిందితులను అరెస్టు చేయలేదు. అంటే నిందితుల పలుకుబడి ఎలా ఉందో అర్ధం అవుతుంది. బాదితులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి కూడ దైర్యం సరిపోవడం లేదు అంటే. పరిస్థితి ఎంత దారుణంగా ఉంది.
Read Also: Vaishali Kidnap Case : మరో ట్విస్ట్.. ఇంట్లో ఉన్నోళ్లను పోలీసులు తీసుకెళ్లారు..!
నిందితులకు రాజకీయ పక్షాలు, పోలీసు యంత్రాంగం మద్దతు ఎలా ఉందో అర్ధం అవుతుంది. అయితే అది ఎయిర్ గన్ అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మరి ఎయిర్ గన్అయినప్పటికి దాని తో బెదిరించడం అనేది తప్పు కదా.. ఇవతలి వారికి అది ఎయిర్ గన్ నా మరొక్కటినా అనేది ఎలా తెలుస్తోంది. ఈ ఘటన గురించి ఇప్పటి వరకు నిందితుల అరెస్టు వ్యవహారం తేలనేలేదు. అంటే ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతుంది. సోషల్ మీడియాలో తుపాకులతో బెదిరించిన ఘటన స్పష్టం కనిపిస్తున్నప్పటికి ఇప్పటి వరకు పోలీసులు మాత్రం నోరు మెదపడం లేదు. రాజాపురం గ్రామంలో భూములను ఆక్రమించు కోవడమే కాకుండా, అక్కడ ఉన్నతమ ఇంటికి కూడ బాదిత కుటుంబాన్ని వెళ్లనీయకుండా తుపాకితో బెదిరించిన ఘటన ఇది.
కట్ చేస్తే అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఇకపోతే ఖమ్మం నగరంలో జిల్లా ప్రధానకేంద్రంలో కూడా రౌడీయిజం పెచ్చరిల్లుతోంది. అయితే రెండు రోజుల క్రితం పెట్రోల్ దొంగతనాన్ని ప్రశ్నించారని ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ కుటుంబంపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఇళ్ల మీద పడి కొట్టారు. అవన్ని సిసి పుటేజి లో దొరికాయి. అయితే తు తూ మంత్రం చర్యలను ప్రారంబించారు. అసలు సిసి కెమారాలో దొరకితే తప్ప చర్యలను తీసుకునే స్థితిలో పోలీసుయంత్రాంగంలేదు. పోలీసు యంత్రాంగం అంతా వివి ఐపి సేవలో మాత్రమే తరించి పోతున్నపరిస్థితి ఉంది. ఉత్తర ప్రదేశ్ కుచెందిన వారిని విచక్షణరహితంగా కొట్టారు. రాత్రి అవుతుందంటే చాలు ఖమ్మం నగరంలో రౌడీ మూకలు పెచ్చరిల్లి పోతున్నారు.
ఖమ్మం,కొత్తగూడెం నగరాల్లో రోడ్ల మీద రయ్ రయ్ అంటూ మోటార్ బైక్ లమీద రైడింగ్ లు సాగుతున్నాయి. ఎవ్వరన్న ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు. వారిని పోలీసు స్టేషన్ లకు పిలిపిస్తే వెంటనే ఓ ప్రజా ప్రతినిది నుంచి పోన్ లువస్తున్నాయి. ఇదే తతంగం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాపితంగా సాగుతుంది. తాజాగా నిన్నటికి నిన్న రాష్ డ్రైవింగ్ తో కూసుమంచిలో పని చేస్తున్న ఎ ఎస్ ఐ ఒక్కరికి తగిలి మృతి చెందడం జరిగింది. పోలీసులు రోడ్ల మీద ఎక్కడ కనిపించరు.కనిపించడం అంటూ జరిగిందంటే అక్కడ బైక్ లకు పైన్ లు వేస్తు మాత్రమే కనిపిస్తారు.ట్రాపిక్ జామ్ జరిగిన అక్కడ ట్రాపిక్ జామ్ ను క్రమబద్దీకరణ చేయడం కోసం ఎటువంటి పని మాత్రం చేయరు.అక్కడ వారుచేసేది పోటోలు తీసుకుంటు కూర్చోవడమే.. ఇప్పుడు వారుచేస్తున్న ఏకైక పని అది ఒక్కటే.. నగరాల వద్ద నుంచి గ్రామాల వరకు పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఒక్క ఫోటోలు తీసే కార్యక్రమానికి మాత్రమే నిమగ్నం అయ్యారు. లేదా వి విఐ పి , ప్రజా ప్రతినిదుల సేవలో మాత్రమే నిమగ్నంఅయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Read Also: Ananya Panday: రేటు తగ్గించిన లైగర్ బ్యూటీ.. ఉపయోగం లేదంటున్న నిర్మాతలు