Siddipet Car Accident: సిద్దిపేట జిల్లాలో జరిగిన కారు ప్రమాదం విషాదం మిగిల్చింది. కొండపాక మండలం జప్తి నాచారం శివారులో ఓ కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. బావిలో పడ్డ కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా.. ఇద్దరు ప్రాణాలతో బయటపడగా మరొకరు కారులోనే ఇరుక్కుపోయి చనిపోయారు. బావిలో పడ్డ కారు, యాదగిరి కోసం ఆరుగంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. సిద్దిపేట జిల్లా సిరిసినగండ్లకు చెందిన వెంకటస్వామి తన బావలను ఇంటికి తీసుకురావడానికి కారు తీసుకుని కొండపాకకి బయలుదేరాడు.…
తన ప్రేయసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని యువకుడు కక్షగట్టి.. ఆమెను కత్తితో 20 సార్లు పొడిచాడు. అనంతరం అతడు కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి తాలూకా అవటి గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.
Bihar Thief: రైలు, బస్సుల్లో వంటి రద్దీగా ఉండే ప్రదేశాల్లోనూ దొంగలు తమ చేతి వాటాన్ని చూపిస్తూనే ఉంటారు. ఎంత తెలివిగా తప్పించుకున్నా కొన్నిసార్లు దొంగ దొరికిపోతుంటాడు. తాజాగా ఓ దొంగ రైల్వే స్టేషన్ నుంచి కదులుతున్న రైలులో మొబైల్ ఫోన్ చోరీకి ప్రయత్నించి చివరికి ఊహించని విధంగా విఫలమయ్యాడు. కదులుతున్న రైలులో ఉన్న ప్రయాణికుల నుంచి మొబైల్ ఫోన్ చోరీ చేయాలనుకున్న దొంగకు భయంకరమైన అనుభవం ఎదురైంది. అప్రమత్తమైన ప్రయాణికులు అతడి చేయిని పట్టుకోవడంతో సుమారు…
ఇద్దరు యువతులు చెట్టుకు వేలాడుతూ కనిపించడం కలకలం సృష్టించింది. దళిత వర్గానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి ఆ తర్వాత వారిపై లైంగికంగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో.. తమ కుమార్తెపై జరిగిన దారుణానికి న్యాయం జరగకపోతే ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేయబోమని ఓ కుటుంబం పట్టుబట్టి కూర్చొంది. దహన సంస్కారాలు జరపకుండా మృతదేహాన్ని ఉప్పుతో కప్పివేసి 45 రోజులుగా అలాగే ఉంచారు.