ఇటీవల కాలంలో కొంతమంది మహిళలు పేగు తెంచుకుని పుట్టిన పిల్లల విషయంలో వ్యవహరిస్తున్న తీరు తల్లి ప్రేమకు మచ్చ తెచ్చే విధంగా ఉంది. తాజాగా ఇలాంటి తరహా ఘటన మహారాష్ట్రలో జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని సీరియల్ కిల్లర్ సంచరిస్తున్నాడు. హంతకుల కోసం ఆరు పోలీసు బృందాలు వెతుకులాటలో నిమగ్నమయ్యాయి.
VBIT College : ఘట్కేసర్ మండలంలోని వీబీఐటీ కాలేజ్ అమ్మాయిలపై వేధింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేధింపులకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడు ప్రదీప్‌ను ఎట్టకేలకు పోలీసులు ట్రేస్ చేశారు.
ఉద్యోగం లేని అమ్మాయిలకు వల వేసి 60 వేల జీతం అంటూ వ్యభిచారంలోకి దింపి.. డేటింగ్ యాప్‌తో వ్యభిచారం చేస్తున్న ముఠాను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
కేరళలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక హోటల్ నుంచి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్న బిర్యానీ వంటకం 'కుజిమంతి'ని తిని ఓ మహిళ ఫుడ్ పాయిజనింగ్‌కు సంబంధించిన అనుమానాస్పద కేసులో ప్రాణాలు కోల్పోయింది.
అగ్రరాజ్యమైన అమెరికాలో గన్‌కల్చర్ నానాటికి పేట్రేగుతోంది. అమెరికాలోని తూర్పు రాష్ట్రమైన వర్జీనియాలోని ప్రాథమిక పాఠశాల తరగతి గదిలో శుక్రవారం ఆరేళ్ల బాలుడు కాల్పులు జరపడంతో ఉపాధ్యాయురాలు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
కొత్త సంవత్సరం వేళ ఢిల్లీలో ఓ యువతిని కారుతో దాదాపు 13 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటనను మరువక ముందే మరో భయంకరమైన ఘటన హర్యానాలో జరిగింది. తన ద్విచక్రవాహనం ఎక్కడానికి నిరాకరించినందుకు ఓ వ్యక్తి ఓ మహిళను హెల్మెట్‌తో దారుణంగా చితకబాదాడు.