ఢిల్లీలోని కాంజావాలాలో 20 ఏళ్ల యువతిని కారు 13 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటనను మరువక ముందే ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ ఘటనపై చర్చ జరుగుతుండగానే యూపీలోని బాండాలో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారి భవిష్యత్ను తీర్చిదిద్దాల్సిన గురువే బుద్ధితక్కువ పనులు చేస్తూ కీచకుడిలా మారాడు. మైనర్ విద్యార్థుల అసభ్యకరమైన వీడియోలను క్యాప్చర్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నందుకు నవాడాకు చెందిన మదర్సా ఉపాధ్యాయుడిని బీహార్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
Shraddha Walkar Case: యావత్ దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్దావాకర్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య వెలుగులోకి రావడంతో నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం శ్రద్ధావాకర్ శరీర భాగాలను పారేసిన ప్రాంతం నుంచి ఎముకలు, వెంట్రుకలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ నివేదిక కోసం పంపించారు. డిఎన్ఎ మైటోకాన్డ్రియల్ ప్రొఫైలింగ్ కోసం పోలీసులు పంపిన వెంట్రుకలు, ఎముకల నమూనాలు శ్రద్ధా వాకర్ వే అని తేలింది. అటవీ ప్రాంతంలో దొరికన వెంట్రుకలు,…
కరోనా నుంచి తప్పించుకోవడానికి ముక్కూ, మూతి కవర్ చేసేలా మాస్కులను వాడటం సాధారణం అయిపోయింది. ప్రతి ఒక్కరు వీటిని విధిగా ధరించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇలా ఎంత మంది ఆచరిస్తున్నారో లేదో కానీ, ఓ వ్యక్తి మాత్రం తన బైక్ నంబర్ ప్లేటుకు కూడా మాస్క్ తగిలించాడు.
ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇంటికి పొరుగున ఉండే 18 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసి ఆపై విషం పెట్టారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
Chinese Manja : గాలిపటాలు ఎగురవేసేటప్పుడు చైనా మాంజా అస్సలు ఉపయోగించొద్దంటూ పదపదే ప్రభుత్వ అధికారులు సూచిస్తుంటారు. అంతేకాకుండా చైనా మాంజా విక్రయాలపై ప్రభుత్వం నిషేధం కూడా విధించింది.
ఒడిశాలో మంగళవారం మరో రష్యన్ శవమై కనిపించాడని, పక్షం రోజుల్లో ఇది మూడోదని పోలీసులు తెలిపారు. జగత్సింగ్పూర్ జిల్లాలోని పారాదీప్ ఓడరేవులో లంగరు వేసిన ఓడలో మిల్యకోవ్ సెర్గీ అనే రష్యన్ వ్యక్తి శవమై కనిపించాడు.