Man Chops Private Part: భార్యభర్తల గొడవ భర్త ప్రాణాల మీదికి తీసుకువచ్చింది. భార్య పుట్టింటికి వెళ్లి తిరిగిరావడం లేదని ఓ వ్యక్తి ఏకంగా ప్రైవేటు పార్ట్ ను కోసేసుకున్నాడు. ఈ ఘటన బీహారలోని మాధేపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని రజనీ నయానగర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని చూసిన బంధువులు స్థానికంగా ఉన్న వైద్య కళాశాలకు తరలించారు.
Read Also: BBC Documentary on Modi: బీబీసీ డాక్యుమెంటరీ ట్వీట్లను బ్లాక్ చేసిన కేంద్రం..
తన భార్య, ఆమె తల్లిదండ్రుల ఇంటి వద్దే ఉంటోంది. దీంతో కోపంతో ఉన్న వ్యక్తి తన ప్రైవేట్ భాగాన్ని కట్ చేసుకున్నాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మహేంద్ర బసుకి కుమారుడు కృష్ణ బసుకి(25) అనే వ్యక్తి గోల్ పరా పోలీస్ స్టేషన్ పరిధిలోని మలోధ్ వార్డు నివాసి ఛోటే లాల్ బాసుకి కుమార్తె అనితను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ముగ్గురు కుమార్తెలు, ఒక కమారుడు నలుగురు సంతానం. కృష్ణ పంజాబ్ లోని మండిలో పనిచేస్తూ.. అక్కడే నివాసం ఉంటున్నాడు. రెండు నెలల క్రితం నయానగర్లోని తన కుటుంబాన్ని చూసేందుకు వచ్చాడు. అయితే ఆ సమయంలో అనిత తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఆమె రావడంతో ఆలస్యం కావడంతో కోపంతో కృష్ణ పదునైన ఆయుధంతో తన ప్రైవేట్ భాగాన్ని నరికేసుకున్నాడు. కృష్ణ మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రాణాపాయం లేదని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో డాక్టర్ సుకేష్ కుమార్ తెలిపారు.